మహిళల హక్కులను తెలుసుకోవాలి
గీసుకొండ: మహిళలు తమ హక్కులను తెలు సుకుని సాధించుకున్నప్పుడే సాధికారత సాధ్యం అవుతుందని జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి అన్నారు. సోమవారం గంగదేవిపల్లిలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆ ధ్వర్యంలో మహిళా సహాయతా కమిటీ సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సమ న్వయకర్తగా పాల్గొని ఆయన మాట్లాడా రు. మహిళలు తమ సమస్యలను ధైర్యంగా బయటకు చెప్పాలన్నారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు మేనేజర్ కవిరాజ్ మాట్లాడుతూ మహిళలు వారి కోసం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఇందిర,ఆర్గనైజేషన్ స భ్యులు అక్తర్,వనీత తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
కాళోజీ సెంటర్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ సెక్టార్‌లో శిక్షణ మరియు ప్లేస్‌మెంట్ జాబ్‌మేళాను ఈ నెల 18న (బుధవారం) నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన, శిక్షణ శాఖ జిల్లా అధికారి సీహెచ్. ఉమారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకు వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సర్వశిక్ష ఉద్యోగుల
డిమాండ్లు పరిష్కరించాలి
● టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భోగేశ్వర్
కాళోజీ సెంటర్: సర్వశిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు. సోమవారం సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావంగా వసంతాపూర్ యూపీఎస్ పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో వెట్టిచాకిరి విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని, సర్వశిక్ష ఉద్యోగులు, కేజీబీవీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ తక్షణమే మినిమం టైం స్కేల్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె.సుభాష్, ఎ.మోహన్ రావు, పి.ఇందిర, వి.రమాదేవి, పి.శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎంపీఓ శ్రీధర్‌రాజు సస్పెన్షన్
చెన్నారావుపేట: చెన్నారావుపేట ఎంపీఓ శ్రీధర్‌రాజును జిల్లా కలెక్టర్ సత్య శారద సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పలు మార్లు బెదిరింపులకు పాల్పడటంతో సస్పెండ్ చేసినట్లు వెల్ల డించారు. గతంలో కూడా నెక్కొండ మండలంలో పనిచేసినప్పుడు ఏసీబీకి పట్టుబడ్డాడు. ప్రస్తుతం సస్పెండ్ కావడం విశేషం.
క్రీడల్లో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్
వరంగల్: క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా యువజన క్రీడల అధికారిణి సత్యవాణి అన్నారు. సోమవారం వరంగల్‌లోని ఓ సిటీ స్టేడియంలో వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలకు ముఖ్యఅతిథులుగా వరంగల్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, డీవైఎస్‌ఓ సత్యవాణిలు పాల్గొని మాట్లాడారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు హాకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి అబ్దుల్లాఖాన్ మాట్లాడుతూ సుమారు 140 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కె.మల్లికార్జున్, అక్తర్, రిఫరీ బోర్డు కన్వీనర్ హసన్, నారాయణ, మండల బాధ్యులు ఏలియా, రవీందర్, శ్రీకాంత్, కబడ్డీ కోచ్ రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment