ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పెన్షనర్ల ఆవేదన
మంగళవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
జిల్లాల వారీగా పెన్షనర్లు ఇలా..
– 8లోu
ఆస్పత్రికొస్తే అవస్థే!
పరకాల: పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో కుటుంబీకులు ఎన్నో అవస్థలు పడితే తప్ప రోగికి వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ అరకొర వసతుల మాట అటుంచితే.. సిబ్బంది నిర్లక్ష్యం నిండా కనిపిస్తోంది. సోమవారం రాత్రి 9:30 గంటలకు శ్వాస సమస్యతో బాధపడుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలిని కుటుంబీకులు ఆటోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వృద్ధురాలి కుమారుడు అన్నమనేని తిరుపతిరావు ఆస్పత్రిలోకి పరుగున వెళ్లి తల్లి ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ఎలాగోలా మీరే లోపలికి తీసుకురావాలని.. అప్పుడే వైద్యం అందిస్తామని అక్కడి సిబ్బంది అతడిని పురమాయించారు. కాలికి గాయమై ఉన్నప్పటికీ అతడు, అతడి భార్య ఆటోలోంచి ఎత్తుకుని మెట్ల వరకు మోసుకొచ్చారు. కానీ.. లోపలికి తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులే ఆపసోపాలు పడుతూ వీల్‌చైర్‌తో ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా చేతులు కట్టుకుని వెనకాలే నడుస్తూ వచ్చాడు వార్డ్ బాయ్. వైద్యులు పరీక్షించిన అనంతరం ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇదంతా చూసిన మిగతా రోగులు, వారి బంధువులు పరకాల సివిల్ ఆస్పత్రికొస్తే అవస్థలు పడాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఒకరికి బదులు
మరొకరికి జరిమానా
దామెర: మండల కేంద్రంలో కారు యజమాని చేసిన తప్పునకు ట్రాఫిక్ అధికారులు ట్రాక్టర్ యజమానికి జరిమానా వేశారు. దామెరకు చెందిన గోనెల రమేశ్ టీఎస్–24 టీ–7024 నంబర్‌గల ట్రాక్టర్ ట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. ఈనెల 8న ట్రాఫిక్ నియమాలు అతిక్రమించాడంటూ అతడి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వారు పంపిన వివరాలు చూసి రమేశ్ అవాక్కయ్యాడు. అందులో (టీఎస్–24 సీ 7024) నంబర్ ఉన్న కారు ఫొటో చేపిస్తూ (టీఎస్ 24 టీ 7024) నంబర్ ఉన్న వాహనం హైదబాదాద్ నర్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కారణంగా 1,035 రూపాయలు ఫైన్ చెల్లించాలని ఆ మెసేజ్‌లో ఉంది. ట్రాఫిక్ అధికారులు నంబర్ తప్పుగా నమోదు చేయడం కారణంగా తాను చేయని తప్పునకు ఫైన్ కట్టాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని బాధతుడు వేడుకుంటున్నాడు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
● 2023లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వలేదు.
వెంటనే ప్రకటించి 2023 జూన్ నుంచి అమలు చేయాలి.
● 5 డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క డీఏ ఇచ్చారు. జనవరిలో మరో డీఏ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ డీఏలు 5కు
చేరుకోనుండడంతో మొత్తం వెంటనే ఇవ్వాలి.
● మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తోపాటు పెండింగ్ బిల్లులను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా ఏడాదైనా
చెల్లించడం లేదు. వీటిని వెంటనే విడుదల చేయాలి.
● కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
● రూ.398లతో నియామకమైన ఉపాధ్యాయులకు
నోషనల్ ఇంక్రిమెంట్ చెల్లించి పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
● ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో 25 శాతం రాయితీ
కల్పిస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ కల్పించాలి.
● రిటైర్డ్ అయ్యాక స్వస్థలాల్లో నివాసం ఉంటారు. ఏదేని చిన్న అవసరం వచ్చినా, ఇతర సమస్యలు తలెత్తినా సుదూర ప్రాంతాల్లోని పాత కార్యాలయాలకు వెళ్లడం వృద్ధాప్యంలో చాలా ఇబ్బందికరం. పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి.
పింఛన్ అనేది ఒక బహుమానం కాదు, యజమాని దయపై ఆధారపడిన విషయం కాదు. లేదా ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కాదు. ఇది గతంలో అందించిన సేవలకు చెల్లింపు. సామాజిక–ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ చర్య.
– 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు తీర్పు
●
రుద్రేశ్వరుడికి లక్ష బిల్వార్చన
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి లక్షబిల్వార్చన నిర్వహించారు. సోమవారం భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు జరిపారు.
విద్యార్థులకు బహుమతులు
హన్మకొండ కల్చరల్: హనుమకొండకు చెందిన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత పెండ్యాల లక్ష్మీ ప్రియ సోమవారం ‘నృత్య కౌముది బెస్ట్ యూత్ క్లాసికల్ డాన్సర్ 2024’ అవార్డును అందుకున్నారు. అభినయ నృత్యభారతి ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన 29వ జాతీయ నృత్యోత్సవ పోటీల్లో ఈఅవార్డు అందుకున్నా రు. జక్కా ఆరాధరెడ్డి జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి అందుకున్నారు. స ద్గురు శివానంద నృత్యమాల నృత్య గురువు బొంపల్లి సుధీర్‌రావు దగ్గర లక్ష్మీప్రియ, ఆరాధరెడ్డి నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. ఈసందర్భంగా సుధీర్‌రావు అభినందనలు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
విద్యారణ్యపురి: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. హనుమకొండ ఏక శిల పార్కు ఎదుట కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. శిబిరాన్ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ సందర్శించి మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వరంగల్ ఽఅధ్యక్షుడు దొనికల శ్రీధర్‌గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎండీ షఫీ ఉద్యోగులు పాల్గొన్నారు.
నిట్‌లో ఐదు రోజుల
వర్క్‌షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్‌లోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘డిజిటల్ ట్విన్నింగ్ ఆఫ్ అండర్‌గ్రౌండ్ యుటిలిటీస్’ అంశంపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్‌షాప్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నెదర్‌లాండ్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రంజిత్ సోమాన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సౌజన్యంతో అకడమిక్ అండ్ రీసెర్చ్ కోలాబరేషన్ (స్పార్క్) స్కీమ్‌లో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నెదర్‌లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లీయాన్‌ఓల్డీ, నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, రతీశ్‌కుమార్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అప్రెంటిస్ కోసం
దరఖాస్తు చేసుకోవాలి
విద్యారణ్యపురి: మూడేళ్లలో (2022, 2023, 2024) పారామెడికల్ కోర్సులు (ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ) పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని హనుమకొండ డీఐఈఓ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ మిషన్ ఆస్పత్రి, పరకాల పీహెచ్‌సీకి సంబంధించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రుల్లో దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు వరంగల్ జిల్లా నోడల్ అఽధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు హనుమకొండలోని డీఐఈఓ కార్యాలయం, ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
హనుమకొండ
వరంగల్
యుక్త వయస్సులో సేవలు అందించిన ఉద్యోగులకు వృద్ధాప్యంలో పూర్తిస్థాయి బెనిఫిట్లు అందడం లేదు. దాదాపు 40 ఏళ్లపాటు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాక ఆర్థిక భరోసా, అందాల్సిన ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. పెన్షన్ దయతో ఇచ్చేది కాదు.. గత సేవలకు ఇచ్చే చెల్లింపు అని పెన్షనర్లు పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30వేల మందికిపైగా పెన్షనర్లు ఉన్నారు. ఆయా జిల్లాల్లో అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నారు. నేడు జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా వారి దీర్ఘకాలిక సమస్యలపై కథనం.
– హన్మకొండ
మానుకోట
జనగామ
ములుగు
జేఎస్
భూపాలపల్లి
సమస్యలపై
ప్రభుత్వం చర్చించాలి
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ.. పెన్షనర్ల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండడం వల్ల ఇబ్బంది అవతోంది.
– ఇ.నర్సింహారెడ్డి,
ప్రభుత్వ పెన్షనర్స్ సలహాదారుడు
ప్రభుత్వం చిన్నచూపు
పెన్షనర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రధానమైన, న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుండా కావాలని జాప్యం చేస్తోంది. ఎన్నికల ముందు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పట్టించుకోవడం లేదు.
– తూపురాణి సీతారాం,
తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ
3,500 పైగా రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే సబ్‌డివిజన్ పరిధిలోని కాజీపేటతోపాటు వరంగల్ –విజయవాడ రూట్‌లోని కొండపల్లి వరకు, ఘన్‌పూర్– జనగామ–ఆలేరు వరకు, జమ్మికుంట– పెద్దపల్లి– రామగుండం– బెల్లంపల్లి– సిర్‌పూర్‌కాగజ్‌నగర్ వరకు కలిపి మొత్తం 3,500 మందికి పై చిలుకు రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఆయాచోట్ల ఏర్పాటుచేసిన అసోసియేషన్లు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, వివిధ బెనిఫిట్స్ అందజేతలో సహాయపడుతున్నాయి. ఒక్క కాజీపేట అసోసియేషన్‌లోనే 1,500 మంది సభ్యత్వం కలిగి ఉన్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కందుల సంగమయ్య తెలిపారు.
ఒకరికొకరు తోడుగా..
డోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. 1997లో కొంతమంది ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు డోర్నకల్‌లో రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 150 మందితో నెలవారీ సభ్యత్వ రుసుముతో అసోసియేషన్ ప్రారంభించి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పెన్షన్ పొందే సమయంలో ఎదురవుతున్న సమస్యలు, రైల్వే పాసుల మంజూరు, లైవ్ సర్టిఫికెట్ల సమర్పణ, బ్యాంకుల్లో ఎదురయ్యే సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం 445 మంది సభ్యులు ఉండగా నెలకు రూ.150 చొప్పున సభ్యత్వ రుసుము వసూలు చేస్తున్నారు. సభ్యుడు ఎవరైనా మరణిస్తే రూ.15 వేలు డెత్‌ఫండ్ కింద అందిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే పెన్షనర్ల అసోసియేషన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు సైతం నిర్మించుకున్నారు. జిల్లా పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు అందులో సభ్యులుగా ఉంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్‌ను వేదికగా చేసుకుని గళం వినిపిస్తున్నారు. సాయంత్రం ఆటవిడుపుగా అసోసియేషన్ భవనాలు ఉపయోగపడుతున్నాయి. లైవ్‌సర్టిఫికెట్ల సమర్పణ సమయంలో సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాసటగా నిలుస్తున్నాయి.
హెల్త్‌కార్డుపై ఎడతెగని పోరాటం..
వృద్ధాప్యంలో తరచూ అనారోగ్య సమస్యలు ఎదురుకావడం సర్వసాధారణం. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించాలని ఏళ్ల తరబడిగా పోరాటం చేస్తున్నా వారి శ్రమకు ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వం హెల్త్‌కార్డులు జారీ చేసినా.. పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పరిమితి లేకుండా వైద్య చికిత్స అందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగిగా సేవలు అందించినందుకు పెన్షనర్ల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన, చికిత్స అందించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అంటున్నారు.
పెన్షనర్ల గౌరవం,
సమాజంలో గుర్తింపు కోసం సంవత్సరాలుగా పోరాడిన డీఎస్ నకరాను కృతజ్ఞతతో స్మరించుకోవడానికి ‘ ప్రతిఏటా డిసెంబర్
17న ‘జాతీయ పెన్షనర్స్ డే’ జరుపుకుంటారు.
ఇబ్బందులు పెట్టడం సరికాదు..
వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం..? చేసిన సేవలకు గుర్తింపుగా, గౌరవంగా ఇచ్చేది పెన్షన్. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి. 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ ఇవ్వాలి.
– తిరువరంగం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
న్యూస్‌రీల్
పెన్షన్ బహుమానం కాదు.. గత సేవలకు చెల్లింపు
జనవరి వస్తే పెండింగ్‌లో ఐదు డీఏలు
ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్న పింఛన్‌దారులు
పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
నేడు నేషనల్ పెన్షనర్స్ డే
ముగిసిన గ్రూప్–2 పరీక్షలు
వరంగల్/ఖిలా వరంగల్: జిల్లాలో గ్రూప్–2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం జరిగిన పేపర్–3 పరీక్షకు 5,174 మంది, పేపర్–4 పరీక్షకు 5,167 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, వరంగల్ సెంట్రల్ పబ్లిక్, ఏఎస్‌ఎం, తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో జరిగిన పరీక్ష కేంద్రాలకు సుమారు ఐదుగురు అభ్యర్థులు రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు.
హనుమకొండలో 48శాతం హాజరు
హన్మకొండ: టీజీపీఎస్‌సీ గ్రూప్–2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమవారం రెండో రోజు 48 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 33,005 మంది అభ్యర్థులకుగాను 16,026 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 33,005 మందికి గాను 16,044 మంది అఽభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 48.61 శాతం, మధ్యాహ్నం 48.61 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment