ముగిసిన గ్రూప్–2 పరీక్షలు
వరంగల్/ఖిలా వరంగల్: జిల్లాలో గ్రూప్–2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం జరిగిన పేపర్–3 పరీక్షకు 5,174 మంది, పేపర్–4 పరీక్షకు 5,167 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, వరంగల్ సెంట్రల్ పబ్లిక్, ఏఎస్‌ఎం, తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో జరిగిన పరీక్ష కేంద్రాలకు సుమారు ఐదుగురు అభ్యర్థులు రెండు నిమిషాల ఆలస్యం కావడంతో అధికారులు పరీక్ష కేంద్రాలకు అనుమతించలేదు. జిల్లా వ్యాప్తంగా సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment