జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం
సంగెం: దాతల సహకారంతో సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎస్సై ఎల్.నరేశ్, ప్రిన్సిపాల్ కాక మాధవరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేశ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించేందుకు అధ్యాపకులు కృషి చేయడం అభినందనీయమన్నారు. కళాశాలలోని మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. దాతలు ముందుకు వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా మధ్యాహ్న భోజన పథకం కొనసాగాలా చూడాలని ప్రిన్సిపాల్ కోరారు. వంట చేయడానికి సైతం కళాశాల సిబ్బంది ముందుకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దాతలు శ్యామల శిల్ప, వల్లాల శైలజ, పుసులేటి జానకి, రోజనాల నరసన్ (హైదరాబాద్), రావిపాటి వెంకటేశ్వర్‌రావు, వల్లంపట్ల సంపత్‌కుమార్, సులి రాజశేఖర్, కన్నెబోయిన నవీన్, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది కారంతో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment