ప్రకృతి సేద్యం లాభదాయకం
● మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య
వర్ధన్నపేట: ప్రకృతి సేద్యం లాభదాయకమని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య అన్నారు. మండలంలోని చంద్రుతండాలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహజ ఎరువులతో పంటలను సాగుచేయాలని సూచించారు. ఇందుకు ఆవుమూత్రం, పేడ, పాలు, పెరుగు తదితర వాటిని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా పప్పు దినుసుల పంటల సాగుతో నేలలో సారం పెరుగుతుందని వివరించారు. నేలలో నీటి నిల్వ తత్వాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. డాక్టర్ రాజు విత్తన శుద్ధి, పంట వివిధ దశల్లో జీవామృతం, చీడపీడల నివారణకు వేప కషాయం, పొగాకు కషాయం, పచ్చిమిర్చితో తయారు చేసిన మిశ్రమాలను తెగుళ్లు, పురుగుల నివారణకు ఉపయోగించే విధానాన్ని వివరించారు. రైతులు సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తిచేశారు. కార్యక్రమంలో 100 మంది రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment