ట్రక్‌షీట్లు లేకుండా ధాన్యం దిగుమతి చేయొద్దు
దుగ్గొండి: ట్రక్‌షీట్లు లేకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు దిగుమతి చేసుకోవద్దని అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. గిర్నిబావిలోని గుణ లోకేశ్వర మిల్లును గురువారం ఆమె తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్లలో ధాన్యం ఎందుకు తరలిస్తున్నారు, కాంట్రాక్టర్ లారీలు సమకూర్చడం లేదా అని ప్రశ్నించారు. ఐకేపీ నిర్వాహకులను పిలిపించి అక్కడిక్కడే ట్రక్‌షీట్లు రాయించారు. అనంతరం మైసంపల్లి, ముద్దునూరు, పోలారం, దుగ్గొండి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఆమె వెంట సివిల్ సప్లయీస్ డీఎం సంధ్య, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఆర్‌ఐ రాంబాబు, మిల్లు యజమాని జంగా రాజిరెడ్డి, ఎంపీఎం రాజ్‌కుమార్, సమాఖ్య అధ్యక్షురాలు లలిత, సీసీలు, నిర్వాహకులు ఉన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన
అదనపు కలెక్టర్
గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలుర గురుకుల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబ ట్టారు. భోజనం ఎలా ఉంది, నూతన మెనూ పాటిస్తున్నారా లేదా అని అడిగారు. వంటలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ విషయంలో తప్పులు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య ఉన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
Comments
Please login to add a commentAdd a comment