వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

Published Sun, Dec 22 2024 1:04 AM | Last Updated on Sun, Dec 22 2024 1:04 AM

వైద్య

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024
● బోనం.. కరుణించాలి సీఎం
● కాంతిమయం.. ఫాతిమా మందిరం

8లోu

ఈ చిత్రంలో గైడ్‌ టీచర్‌ జర్పుల రాజునాయక్‌తో పాటు ఉన్న విద్యార్థి జర్పుల చందునాయక్‌. శాయంపేట మండలం కాట్రపెల్లిలోని సీఎస్‌ఐ బీజేఎం పాఠశాలకు చెందిన ఇతను జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచాడు. ‘వృత్తం దాని భాగాలు దాని సబ్‌థీమ్‌ మేథమెటికల్‌ మోడలింగ్‌, కాంపిటీషన్‌ థింకింగ్‌’ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపియ్యాడు. ఒక ఫ్లైవుడ్‌ షీట్‌, రెండు డ్రాయింగ్‌ షీట్‌లు కొన్ని ఇనుప మొలలు, కొన్ని హెయిర్‌ బ్యాండ్‌లు, గమ్‌ తదితర వస్తువులతో ఈఎగ్జిబిట్‌ తయారు చేశారు. వృత్తాకారం అనేది మన నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఎగ్జిబిట్‌ తెలియజేస్తుంది. విద్యార్థుల్లో ప్లే వే మెథడ్‌ కూడా ఇందులో భాగమేనని ఇలా బోధన చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుందని విద్యార్థి చెబుతున్నాడు.

నిట్‌లో పది రోజుల జియాన్‌

కోర్సు ప్రారంభం

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో మేథమెటికల్‌ ఫౌండేషన్స్‌ ఫర్‌ అర్రే సిగ్నల్‌ ప్రొసెసింగ్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్‌ అనే అంశంపై నిర్వహిస్తున్న పదిరోజుల జియాన్‌ కోర్సు శనివారం ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ కోహెన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కోర్సును ప్రారంభించారు. కార్యక్రమంలో నిట్‌ ప్రొఫెసర్లు రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అమ్మవారి సన్నిధిలో

డీడీఎస్‌ఏ

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయాన్ని శనివారం స్టేట్‌ ఆడిట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సునయన చౌహాన్‌ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఏఏఓ రమేశ్‌, సీనియర్‌ ఆడిటర్లు అశోక్‌, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష వాయిదా వేయకపోతే

సమ్మెకు వెళ్తాం

ఎంజీఎం: వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల ఏఎన్‌ఎంలకు ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న రాత పరీక్షను వాయిదా వేయకపోతే నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ తెలిపారు. 48 గంటల నిరసనలో భాగంగా శనివారం ఎంజీఎం కూడలిలో ఏఎన్‌ఎంలు మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా యాదానాయక్‌ మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా పని చేస్తున్న వారికి మళ్లీ రాత పరీక్ష నిర్వహించడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జె.సుధాకర్‌, సుజాత, సరోజ, చంద్రకళ, ప్రభావతి, సాంబలక్ష్మి, మంజుల, పుష్పలత, విజయ పాల్గొన్నారు.

‘ఎల్టా’ పోటీలతో

నైపుణ్యాల పెంపు

విద్యారణ్యపురి: ఎల్టా ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల్ని పెంపొందించేందుకు తోడ్పడతాయని హనుమకొండ డీఈఓ డి.వాసంతి అన్నారు. ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌, ఎలక్యూషన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శనివారం డీఈఓ కార్యాలయంలో వాసంతి ఆవిష్కరించారు. జనవరి 3న మండల, 18న జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలు, 31న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8, 9 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ ఎ.శ్రీనివాస్‌, జెండర్‌ అండ్‌ ఈక్విటీ కో–ఆర్డినేటర్‌ సునిత, ఎల్టా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.సంపత్‌, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులది హనుమకొండ జిల్లాలోని ఎల్క తుర్తి మోడల్‌ స్కూల్‌. పేర్లు గణేశ్‌, హరీష్‌ ‘నీపథంలో గణితం’ ఎగ్జిబిట్‌ను గైడ్‌గా పీజీటీ మ్యాథ్స్‌ ఉపాధ్యాయురాల అచరిత సహకారంతో రూపొందించారు. (2023–2024)లో జిల్లా, రాష్ట్ర స్థాయి ఎగ్జిబిట్ల ప్రదర్శనలో ప్రతిభ చూపి ప్రథమ స్థానం సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆగైడ్‌ టీచర్‌ అచరిత భీమదేవరపెల్లి మండలం ముల్కనూరు మోడల్‌ స్కూల్‌లో (పీజీటీ గణితం) పనిచేస్తున్నారు. ప్రతీ రంగంలో గణితం ఉంటుందని తెలియజేసేందుకు కొన్ని మైక్రో ఎగ్జిబిట్లను రూపొందించారు. వృత్తం, అర్ధ వృత్తాలు ఉపయోగించి పగలు, రాత్రి ఏ నెలలో ఎక్కువగా ఉంటాయో, ఏ నెలలో సమానంగా ఉంటాయో ఈ ఎగ్జిబిట్‌ ద్వారా తెలియజేసి ప్రశంసలు అందుకున్నారు. ఈఎగ్జిబిట్‌ 2023లో కేరళలో సదరన్‌ ఇండియా సైన్స్‌ఫెయిర్‌ నందు ఐఐటీ ఆస్ట్రో ఫిజిక్స్‌ స్పెషల్‌ ప్రైజ్‌ అందుకుంది. అంతేకాకుండా గణితాన్ని విద్యార్థులు సులభంగా నేర్చుకునేందుకు గణిత ల్యాబ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. 2023లో అచరితకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వచ్చింది. అలాగే గుజరాత్‌ ఐఐటీ గాంధీనగర్‌లో 2023లో సీసీఎల్‌ వర్క్‌షాపునకు మాస్టర్‌ ట్రైనర్‌గా నైపుణ్యం కోసం అచరిత శిక్షణ పొందారు.

ఈ చిత్రంలో గైడ్‌ టీచర్‌ ఆర్‌.శంకర్‌తో పాటు ఉన్న విద్యార్థి పేరు కె.రాకేశ్‌. హనుమకొండ జిల్లా మడికొండ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో క్లినోమీటర్‌ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించాడు. క్లినో మీటర్‌ లంబకోణ త్రిభుజం లోఉన్న ఎత్తు కోణాన్ని లేదా భూమి నుంచి ఉన్న కోణాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం. ఈ ఎగ్జిబిట్‌, పరికరం, భవనాలు, చెట్లు జెండా స్తంభాలు వంటి వస్తువుల ఎత్తును కొలిచేందుకుగాను ఉపయోగించవచ్చు. ఈ ఎగ్జిబిట్‌ రూపొందించేందుకు వినియోగించిన వస్తువులు పీవీసీ పైపులు, ఒక ఇంచువి నాలుగు, 30 సెంటిమీటర్ల అట్టముక్క, కోణమానిని 0–90,(ఇరువైపులా) 15 సెంటిమీటర్ల దారం, 30 సెంటీమీటర్ల పీవీసి పైపు ముక్కను దారానికి వేలాడదీసినవి. ఇనుప వాచర్‌ను వినియోగించి ఈ ఎగ్జిబిట్‌ను రూపొందించారు.

సంఖ్యాశాస్త్రంలో రామానుజన్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్‌ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌.. రామానుజన్‌ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.

గణిత

దినోత్సవం ఎలా

వచ్చిందంటే..

రాష్ట్రస్థాయి

టాలెంట్‌ టెస్ట్‌కు

ఎంపిక

కాళోజీ సెంటర్‌: రాష్ట్రస్థాయి గణిత

టాలెంట్‌ టెస్టుకు వరంగల్‌ జిల్లా నుంచి 9 మంది విద్యార్థులు ఎంపికై నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తెలుగు మీడియంలో రాయపర్తి మండలం కొలనుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి ఎల్‌.రాంచరణ్‌, ఖిలావరంగల్‌ శంభునిపేట జీహెచ్‌ఎస్‌ నుంచి ఆఫ్రీన్‌, గీసుకొండ మండలం వంచనగిరి జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి జి.భరత్‌, ఇంగ్లిష్‌ మీడియంలో ఖానాపురం సైనిక్‌ స్కూల్‌ విద్యార్థి ఎ.రాజ్‌కుమార్‌, నెక్కొండ మండలం తెలంగాణ గురుకుల పాఠశాల నుంచి ఆర్‌.హర్షిణి, సీహెచ్‌.శ్రీజ, వరంగల్‌ మండలం నరేంద్రనగర్‌ ప్రభుత్వ పాఠశాల నుంచి పి.విశ్వతేజ, వరంగల్‌ మట్టెవాడ జీహెచ్‌ఎస్‌ నుంచి ఎస్‌.రష్మిక, సంగెం మండలం మొండ్రాయి జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి ఎ.దీపిక ఎంపికై నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి గణిత టాలెంట్‌ టెస్ట్‌కు వీరు హాజరుకానున్నట్లు తెలిపారు.

గణితమంటే

అంకెల

గారడీ కాదు.

సంఖ్యల మేళవింపు

అంతకంటే కాదు.

అదొక మహా సముద్రం.

కిటుకు తెలిస్తే తక్షణమే

విజయ తీరాల్ని చేరవచ్చు.

అదే తరహాలో అంకిత భావం,

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో

విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చిన్న వయస్సులోనే చిటికె వేసినంత సులువుగా లెక్కలు చేస్తున్నారు. నేడు (ఆదివారం) రామానుజన్‌ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం. ఈనేపథ్యంలో గణితంలో ప్రతిభ కనబరుస్తున్న ఘనులపై, వారిని తయారు చేస్తున్న ఉపాధ్యాయులపై ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

– విద్యారణ్యపురి

‘గణిత పాఠ్యాంశాల బోధన లెర్నింగ్‌ బై డూయింగ్‌ పద్ధతిలో సూత్రాలను నిరూపిస్తూ సమస్యల సాధనను వివరిస్తే విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోగలుగుతారు’ అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితం రాష్ట్రస్థాయి రిసోర్స్‌ పర్సన్‌ బండారి రమేష్‌ అన్నారు. నేడు (ఆదివారం) జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గణితం అంటే విద్యార్థులు భయానికి లోనవుతారు. కానీ భయపడాల్సిన సబ్జెక్టు ఏమీ కాదు. నేను బ్లాక్‌ బోర్డుపై సూత్రాలు వేసి సమస్యలను సాధించినప్పుడు అతి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే అర్థం చేసుకునేవారు. మిగతా వారు అడగలేక విషయాలను దాటవేసేవారు. పరీక్షల్లో తక్కువగా మార్కులు వచ్చేవి. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన చేశా. ఆ.. ఆలోచన ఫలితమే లెర్నింగ్‌ బై డూయింగ్‌ పద్ధతి. ఈ పద్ధతిలో బోధన చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నా. నేను ధర్మారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సందర్భంలో ప్రయోగాత్మకంగా గణితం బోఽధించినప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం గమనించా. పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులతో చేయిస్తూ గణిత సమస్యలను సాధన చేయించాను. ఆ తర్వాత పరీక్షల్లో 80శాతంమంది మంచి మార్కులు సాధించారు. అప్పటినుంచి లెర్నింగ్‌ బై డూయింగ్‌ పద్ధతిలోనే గణితం బోధిస్తూ వస్తున్నా. చిటూరు, వెంకటాపూర్‌కలాన్‌, ప్రస్తుతం వరంగల్‌ జిల్లా నెక్కొండలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. జాతీయస్థాయిలో సైన్స్‌అండ్‌ టెక్నాలజీలో విజ్ఞాన ప్రదర్శనలకు విద్యార్థులను ప్రోత్సహించా. దానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలలోని ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఉపయోగించి టెక్నాలజీ ద్వారా గణిత పాఠ్యాంశాలను చెబుతున్నా. ఈ ప్రయోగశాలకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్నా. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించి గణిత పాఠ్యాంశాలను బోఽధించడం ద్వారా అమూర్తభావనలను విద్యార్థులు సలభతరంగా అర్థం చేసుకోగలుగుతున్నారు.

సెమినార్‌లో రమేశ్‌ పేపర్‌ ప్రజెంటేషన్‌

జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో శనివారం మేథమెటిక్స్‌ సెమినార్‌ నిర్వహించారు. ఇందులో బండారి రమేశ్‌ గణితం సబ్జెక్టుపై తన పరిశోధన పత్రం సమర్పించారు. దీంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి ఆయనకు సర్టి ఫికెట్‌ ప్రదానం చేశారు.

రమేశ్‌కు సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తున్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి

సమగ్రశిక్ష ఉద్యోగులు మినిమమ్‌ పేస్కేల్‌ను వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా శనివారం పోచమ్మకు బోనమెత్తారు. బాలసముద్రంలోని పోచమ్మగుడిలో బోనాలు సమర్పించారు. సీఎం రేవంత్‌ కరుణించాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. పీటీఐ రాజు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. – విద్యారణ్యపురి

న్యూస్‌రీల్‌

‘లెర్నింగ్‌ బై డూయింగ్‌ అనగా గణితంలో సూత్రాలు, కృత్యాలను నిర్వహిస్తూ ప్రయోగాత్మకంగా సూత్రాలను రాబట్టడం. (ఉదాహరణ త్రిభుజ వైశాల్యం = 1/2 x భూమి x ఎత్తు. విద్యార్థి పై సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు 1/2 ఎలా వచ్చింది అని అడిగితే దానిని ప్రయోగాత్మకంగా వివరించి చెప్పడం)’

No comments yet. Be the first to comment!
Add a comment
వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి1
1/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి2
2/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి3
3/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి4
4/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి5
5/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి6
6/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి7
7/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి8
8/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి9
9/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి10
10/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి11
11/11

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement