న్యూశాయంపేట: ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళా అభ్యర్థులు హార్డ్ కాపీలు అందజేయాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం హార్డ్ కాపీలు మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో అందజేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయమై వరంగల్, హనుమకొండ జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు టి.రమేశ్, డి.మురళీధర్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment