చట్టాలపై అవగాహన లేక నేరాలు
● జడ్జి శాలిని లింగం
● పరకాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
పరకాల: సమాజంలో జీవించే ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన లేకనే నేరాలు పెరిగిపోతున్నాయని పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు చట్టపరంగా న్యాయం చేసేందుకు న్యాయసేవాధికార సంస్థ ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత న్యాయవాదులు, మేధావులపై ఉందన్నారు. పరకాల తాలుకా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఎఫ్‌జే గార్డెన్‌లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరై సివిల్, క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండెల భద్రయ్య, ఏజీపీ లక్కం శంకర్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట సీఐలు క్రాంతికుమార్, ఎకై ్సజ్ సీఐ తాతాజీ, బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్స జనార్దన్, సీనియర్ న్యాయవాదులు మెరుగు శ్రీనివాస్, పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, చంద్రమౌళి, కూకట్ల శ్రీనివాస్, మేకల శ్రావణ్‌కుమార్, గండ్ర నరేశ్‌రెడ్డి, న్యాయవాదులు, ఎంపీడీఓలు, కోర్టు, పరకాల పోలీసు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment