బుధవారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
భద్రంగా ఉండాలనే..
రోడ్డు ప్రమాదాల్లో పిలియన్ రైడర్ల మృతుల సంఖ్యను తగ్గించేందుకు ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాం. పలు ప్రమాదాల్లో వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే పిలియన్ రైడర్లకు హెల్మెట్ నిబంధన విషయంలో కఠినంగా ఉంటున్నాం. చాలావరకు వాహనదారుల్లో మార్పు వచ్చింది. దీనివల్ల వారి కుటుంబాలు సంతోషంగా ఉండే అవకాశం ఉంది.
– అంబర్ కిశోర్ ఝా,
వరంగల్ పోలీస్ కమిషనర్
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం మంది పిలియన్ రైడర్లు (బైక్ నడిపే వారి వెనకాల కూర్చొనే వ్యక్తులు) ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని తగ్గించే దిశగా పోలీసులు పక్కా కార్యాచరణతో ముందుళ్తున్నారు. హెల్మెట్ లేదని 2022 నుంచి ఇప్పటివరకు 10,359 మంది పిలియన్ రైడర్లకు చలాన్ల రూపంలో సుమారు రూ.1,03,59,000 జరిమానా విధించారు. అదేసమయంలో 39 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 2022లో ద్విచక్రవాహనదారుడితోపాటు పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను వరంగల్ పోలీసులు కఠినతరం చేశారు. ఆ ఏడాది ఏకంగా 7,389 చలాన్లు విధించారు. అనంతరం వాహనదారుల్లో మార్పు రావడంతో తర్వాత రెండేళ్లలో భారీగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈఏడాది ఒక్క జనవరిలోనే 234 పిలియన్ రైడర్లకు హెల్మెట్ ధరించని కేసులు నమోదయ్యాయి. మరో 11 నెలల సమయం ఉండడంతో భారీగా పెరిగే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. మోటారు వెహికల్ యాక్ట్–2019 ప్రకారం పిలియన్ రైడర్లకు హెల్మెట్ విషయంలో కఠినంగా ఉంటామని అవగాహన కలిగిస్తున్నారు.
2025
2024
2023
2022
సంవత్సరం
పిలియన్ రైడర్ల
చలాన్లు ఇలా..
234-1
660-22
7,389-3
చలాన్లు–వాహనాల సీజ్
2,076-13
న్యూస్‌రీల్
పిలియన్ రైడర్లు ధరించాల్సిందే
2022 నుంచి ఇప్పటివరకు పదివేలకుపైగా చలాన్లు
రూ.కోటికిపైగా జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
ఈఏడాది ఒక్క జనవరిలోనే 234 మందికి చలాన్లు
Comments
Please login to add a commentAdd a comment