![నాన్ ఓవెన్ బ్యాగ్స్ పరిశ్రమ పరిశీలన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04bply504-330145_mr-1738697054-0.jpg.webp?itok=zseWVG1y)
నాన్ ఓవెన్ బ్యాగ్స్ పరిశ్రమ పరిశీలన
శాయంపేట: మండల కేంద్రంలో మంగళవారం లడాఖ్, కశ్మీర్ ప్రాంతాలకు చెందిన ఎస్‌పీఎమ్, బీపీఎమ్‌ఎస్, మిస్‌లు 18 మంది సభ్యుల బృందం పర్యటించింది. స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా ఉంటూ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడకల్లో పొల్గొన్న మండల కేంద్రానికి చెందిన దాసరి కల్పనకు చెందిన నాన్ ఓవెన్ బ్యాగ్స్ పరిశ్రమను బృంద సభ్యులు పరిశీలించారు. పరిశ్రమ ద్వారా ఒక మహిళ ఉపాధి పొందుతూ 8 మంది మహిళలకు ఉపాధి కల్పించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్‌పీఎమ్ హసీనా బతుల్, బీపీఎమ్‌ఎస్ గుల్జార్ జిగుమత్ సంస్థాన్ కల్పనను తన అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీధర్‌రెడ్డి, సీసీలు, ఎమ్‌ఎస్‌ఏ, వీఓఏలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment