సూర్యనారాయణ
మొగల్తూరు: విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మొగల్తూరులో జరిగింది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం మొగల్తూరుకు చెందిన కుమారీ సూర్యనారాయణ(40) తన ఇంటి నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్ళి దురదృష్టవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూర్యనారాయణ మృతి చెందడంతో పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సూర్యనారాయణకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి నాంచారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిఽ దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment