విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
ఆకివీడు: అయిభీమవరం రహదారిలో ఆక్రమణ బాధితులు తమ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు నిలుపుదల చేశారని స్థానిక ఏఈ కార్యాలయంలో శుక్రవారం రాత్రి బైఠాయించారు. తమ ఇళ్లకు కనెక్షన్ ఇచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. విద్యుత్ నిలుపుదలతో వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులకు పట్టడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. బాధితులకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. బాధితులు రాత్రి కార్యా లయంలోనే బైఠాయించిన చోటే నిద్రించారు.
ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరిని బదిలీ చేస్తూ కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. రెవెన్యూ విభాగంపై ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆమె ఆ విభాగంలో తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, ఫైల్స్ నిర్ణీత గడువులో క్లియర్ చేయకపోవడం, సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, గ్రీవెన్స్‌పై నిర్లక్ష్యం తదితర కారణాలను గుర్తించారు. దీంతో మెజిస్టీరియల్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎస్‌కే షకీల్, కో–ఆర్డినేషన్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ కె.జీవన్‌కుమార్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ దివ్య స్మైలీని సస్పెండ్ చేశారు. అలాగే కో–ఆర్డినేషన్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ తేజను ఆచంట తహసీల్దార్ కార్యాలయానికి, మెజిస్టీరియల్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ యు.వెంకట్ కుమార్‌ను పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేశారు.
నిర్ణీత చార్జీలకే ఇసుక వాహనాలు
భీమవరం (ప్రకాశంచౌక్): ఇసుక వినియోగదారుడు నేరుగా ఫెసిలిటేషన్ సెంటర్‌కు ఫోన్ చేసి నిర్ణీత ధరలకే ఇసుక రవాణా వాహనాలను పొందవచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో ఇసుక కొరత దృష్ట్యా సులువుగా ఇసుకను పొందేందుకు రీచ్‌లను అందుబాటులో ఉంచడంతోపాటు నిర్ణీత ధరలకే రవాణా వాహనాలను ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. వినియోగదారులు కలెక్టరేట్‌లోని ఫెసి లిటేషన్ సెంటర్ నంబర్లు 93914 45753, 86682 91997, 81869 39223, 95501 75144కు ఫోన్ చేసి ఇసుక రవాణాకు వాహనాన్ని పొందవచ్చన్నారు. వినియోగదారుడు నేరుగా రీచ్‌కు వెళ్లి ఆధార్ కార్డు ద్వారా ఉచిత ఇసుకను లోడింగ్ చార్జీలతో పొందవచ్చన్నారు.
ప్రత్యేకాధికారుల పదవీ కాలం పొడిగింపు
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేకాధికారిగా ప్ర స్తుతం గూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకాధికారి పదవీ కాలం వా స్తవానికి ఈనెల 5వ తేదీతో ముగిసింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, రాజాం, బాపట్ల, గూడూరు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాల ప్రత్యేకాధికారుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మే 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ తేదీలోపు లేదా ఆయా పురపాలక సంఘాలకు కొత్త పాలకవర్గం వచ్చే వరకూ ప్రత్యేకాధికారులు కొనసాగుతారు.
ఎంటీఎస్ టీచర్ల సమస్యలపై వినతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎంటీఎస్ టీచర్ల సంఘం నాయకులు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మను కోరారు. శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఇటీవల జరిగిన సర్దుబాటులో తమను ని బంధనలు మీరి 100 కిలోమీటర్ల దూరానికి బ దిలీ చేశారని అన్నారు. అలాగే పదవీ విరమణ వయసును పెంచేలా ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తోట ఎడ్వర్డ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment