మాతాశిశు మరణాలు నివారించాలి
కలెక్టర్ నాగరాణి
భీమవరం(ప్రకాశం చౌక్): మాతాశిశు మరణాలను నూరుశాతం నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాతాశిశు మరణాల నివారణ, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం అమలు, సంతాన సా ఫల్య కేంద్రాలు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. గర్భస్రావం కేసులను ఆడిట్ చేసి పూర్తిస్థాయిలో ని వేదికలు ఇవ్వాలన్నారు. ఆడపిల్లలు నిష్పత్తి తక్కువ గా ఉన్న గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన కల్పించాలన్నారు. సంతాన సాఫల్య కేంద్రాల్లో తరచుగా తనిఖీలు చేసి, రికార్డులను అధ్యయనం చేయాలన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎంహెచ్‌ఓ డా.డి.మహేశ్వరరావు, డీసీహెచ్ పి.సూర్యనారాయణ, జిల్లా ఐసీడీఎస్ అధికారి బి.సుజాతా రాణి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment