సమగ్ర ప్రణాళికతో సమస్యల పరిష్కారం
ఏలూరు(మెట్రో): సమగ్ర ప్రణాళికలతో సమస్యలు పరిష్కరించవచ్చని, 2025–26కి సమగ్ర ప్రణాళికలు తయారుచేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలదేనని ఏపీఎస్‌ఐఆర్ డీపీఆర్ జాయింట్ డైరెక్టర్ జి.రమణ అన్నారు. శుక్రవారం జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో మాస్టర్ ట్రైనర్స్ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లు, మండల పరిషత్‌లు, జిల్లాపరిషత్‌లు స మర్థవంతమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మహిళలకు జీవనోపాధి మా ర్గాలు చూపాలన్నారు. ప్రజా ప్రణాళికా రచనలో అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలనీ, దీనిపై విస్తృత ప్రచారం చే యాలని సూచించారు. ప్రజా ప్రణాళికపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. జెడ్పీ సీఈఓ కేఎస్‌ఎస్ సుబ్బారావు, డి ప్యూటీ సీఈఓ కె.భీమేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్, డీపీఆర్‌సీ, జిల్లా పంచాయతీ అధికారి కె.అనురాధ, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు. డీఎల్‌డీఓలు, ఉమ్మడి జిల్లాలోని డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment