ఇంటింటా క్యాన్సర్ సర్వే
శురకవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
భీమవరం (ప్రకాశంచౌక్): క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా వైద్యారోగ్య శాఖ జిల్లాలో క్యాన్సర్‌పై ఇంటింటా సర్వే చేపట్టింది. జిల్లాలో ఈనెల 16 నుంచి క్యాన్సర్ సర్వేలో భాగంగా స్క్రీనింగ్ ముమ్మరంగా జరుగుతోంది. 18 ఏళ్లు నిండిన వారందరినీ పరీక్షించి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. నోటి క్యాన్సర్, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌లపై పీహెచ్‌సీ వైద్యుల పర్యవేక్షణలో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. యాప్‌లో 150 ప్రశ్నలు ఆయా క్యాన్సర్లకు సంబంధించి ఉంటాయి. వాటిని వైద్య సిబ్బంది సర్వే చేస్తున్న వ్యక్తిని అడిగి వారి సమాధానాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. దీని ద్వారా వ్యక్తి ఆరోగ్య స్థితి తెలుసుకుని వారికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. సర్వేలో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తే వారి వివరాలను పీహెచ్‌సీ వైద్యులకు అందించగా తదుపరి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభమని, ఈ దిశగా సర్వేను వచ్చే ఏడాది ఆగస్టు వరకు నిర్వహించనున్నారు.
30 ఏళ్ల దాటిన మహిళలకు.. జిల్లాలో 30 ఏళ్లు దాటిన మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై స్రీన్కింగ్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. వీరికి 18 ఏళ్లు నిండిన వారి మాదిరిగా నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. పురుషులకు కేవలం నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ మాత్రమే చేస్తున్నారు.
9 మంది గుర్తింపు : జిల్లాలో మొత్తం జనాభా 17.79 లక్షల మంది ఉంటే 18 ఏళ్లు దాటిన వారు 13.22 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకు 5,413 కుటుంబాలకు క్యాన్సర్ సర్వే పూర్తిచేయగా, 15,304 మందికి సమగ్ర స్క్రీనింగ్ చేశారు. 9 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. నోటి క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారు ముగ్గురు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారు నలుగురు, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారు ఇద్దరిని గుర్తించారు.
న్యూస్‌రీల్
జిల్లాలో స్క్రీనింగ్ వివరాలు
కుటుంబాలు 6.16 లక్షలు
పురుషులు, మహిళలు 13.22 లక్షలు
ఇప్పటివరకు పూర్తి
కుటుంబాలు 5,413
పురుషులు, మహిళలు 15,304
సర్వే సిబ్బంది
వైద్యాధికారులు 87
ఏఎన్‌ఎంలు 560
ఆశావర్కర్లు 1,391
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు 365
జిల్లాలో ముమ్మరంగా నిర్వహణ
ఈనెల 16న ప్రారంభం
18 ఏళ్లు నిండిన వారికి ప్రాథమిక పరీక్షలు
జిల్లాలో 13.22 లక్షల మంది లక్ష్యం
ఇప్పటివరకూ 15,304 మందికి పూర్తి
ప్రాథమిక దశలోనే గుర్తించేలా..
జిల్లాలో క్యాన్సర్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా మూడు రకాల క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తున్నాం. క్యాన్సర్‌ను ఆదిలో గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించి సులభంగా నివారించవచ్చు. సర్వే ద్వారా ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాం. క్యాన్సర్ ఉన్నట్లు చాలా మందికి తెలియక వ్యాధి తీవ్రంగా మారిన తర్వాత ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తించడమే సర్వే లక్ష్యం.
– డాక్టర్ డి.మహేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment