హెచ్‌ఎం, వంట సిబ్బందిపై చర్యలు
దెందులూరు: దెందులూరు మండలంలోని జోగన్నపాలెం ప్రాథమి క పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 9 మంది వి ద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణమైన హెచ్‌ఎం, మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ కె.అన్నమ్మ తెలిపారు. నిబంధనలు పట్టించుకోని హెచ్‌ఎంకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం పాఠశాలలో భోజనాన్ని స్వయంగా తా ను రుచి చూసి నాణ్యతను పరిశీలించానని ఎంఈఓ అన్నమ్మ అన్నా రు. భోజనం చేసిన తర్వాత విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. అనంతరం డీఈఓ, ఎంఈఓ ఏలూరులో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే ఇంటి వద్ద చికిత్స పొందుతున్న విద్యార్థులను గురువారం తహసీల్దార్ బి.సుమతి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ప్రతి రెండు గంటలకో సారి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తనకు రి పోర్ట్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment