లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం | - | Sakshi
Sakshi News home page

లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం

Published Fri, Nov 22 2024 12:41 AM | Last Updated on Fri, Nov 22 2024 12:41 AM

లా వి

లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం

భీమవరం: విశాఖ లా కళాశాలలో విద్యార్థినిపై అత్యాచారానికి నిరసనగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో గురువారం ఆందోళన చేపట్టారు. సంఘం జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో జూలై నుంచి ఇప్పటివరకు 98 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినా ఎవరినీ శిక్షించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, అశ్లీల సాహిత్యాల వల్ల మహిళలపై దాడులు పెరిగి పోయాయన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన విద్యార్థులే తోటి విద్యార్థినిపై అత్యాచారం చేయడం దారుణమని వాపోయారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌.ఉదయ్‌కుమారి, ఎస్‌.జయప్రద, ఎ.నాగరత్నం, ఎం.సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మకు పితృవియోగం

భీమవరం: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తండ్రి సూర్యనారాయణరాజు (91) గురువా రం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన్ను భీమవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సూర్యనారాయణరాజుకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా పని చేసి పదవీ విరమణ చేశారు. సూర్యనారాయణ రాజు భౌతిక కాయాన్ని భీమవరానికి తరలించి శుక్రవారం ఉదయం నర్సయ్య అగ్రహారంలోని స్వగృహం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 1 గంటకు టూటౌన్‌లోని బలుసుమూడి మోక్షధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని శ్రీనివాసవర్మ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి

ఏలూరు(మెట్రో): జిల్లాలో సర్వీస్‌, కుటుంబ పెన్షనర్లు తమ వార్షిక ధ్రు వీకరణ పత్రం (లైఫ్‌ స ర్టిఫికెట్‌)ను ఏటా జ నవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు ఉప ఖజానా కార్యాలయంలో సమర్పించాలని జిల్లా ఖజానా, లెక్కల శాఖ అధికారి టి.కృష్ణ గురువారం ప్రకటనలో తెలిపారు. లైఫ్‌ సర్టిఫికెట్‌ను జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ద్వారా సమర్పించవచ్చన్నారు. 2025కి సంబంధించి లైఫ్‌ సర్టిఫికెట్‌ను జనవరి 1 నుంచి మాత్రమే సమర్పించాలని, ముందుగా సమర్పించినవి పరిగణనలోకి తీసుకోమన్నారు.

సోషల్‌ మీడియా కార్యకర్త సతీష్‌పై కేసు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కేసులు, వేధింపులు ఆగడం లేదు. ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు మండలం చానమల్లికి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త బౌతు సతీష్‌పై టీడీపీ నేతల ఫిర్యాదుతో భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సతీష్‌ పోస్టులు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ టీడీపీ భీమడోలు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కమ్మ పద్మా వతి ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గు రువారం సతీష్‌ను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సతీష్‌ పోస్ట్‌ పెట్టినందుకుగాను కేసు పెట్టారు. సతీష్‌ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

‘నవోదయ’ దరఖాస్తులకు గడువు పెంపు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 9,11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్టు డీఆఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఈనెల 27,28 తేదీల్లో అవకాశంలుంటుందని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం 1
1/1

లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement