వలంటీర్లకు సర్కారు షాక్
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి
ఏలూరు (టూటౌన్): రబీ పంటల బీమా ప్రీమి యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, బీమా ప్రీమియం పేరుతో రైతులపై భారం వేయవద్ద ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఏలూరు కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉచి త పంటల బీమా అమలు చేశారన్నారు. అదే త రహాలో ఈ రబీ సీజన్‌లోనూ బీమా ప్రీమియా న్ని ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఇప్పటికే కనీస ధరలు రాక రైతులు నష్టపోతున్న తరుణంలో బీమా ప్రీమియం అదనపు భారంగా మారిందన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని కోరారు.
మద్యం షాపుపై మండిపాటు
కామవరపుకోట: కామవరపుకోట చెక్‌పోస్ట్ సెంటర్‌లో మద్యం షాపు ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని శుక్రవారం గ్రామస్తులు గళమెత్తారు. గ్రామంలోని చెక్‌పోస్ట్ సెంటర్‌లో కనకదుర్గమ్మ ఆలయం ఉందని, ఇటుగా వాహనాల రాకపోకలతో నిత్యంగా రద్దీగా ఉంటుందని, ఇక్కడ మద్యం షాపు ఏర్పాటుతో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ షాపు ఏర్పాటు చేస్తే దశలవారీగా ఉద్యమానికి సిద్ధపడతామని హెచ్చరించారు. కాకి సురేష్ కుమార్, టీవీఎస్ రాజు, నానాది సాగర్, అయితం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్ డీఎస్పీగా చంద్రశేఖర్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీగా బి.చంద్రశేఖర్ నియమితులయ్యా రు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కాకినాడ నుంచి ఏలూరు జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ డీఎస్పీగా పనిచేస్తున్న వీజీ శ్రీహరిరావు కాకినాడ బదిలీపై వెళుతున్నారు.
నేడు ప్రత్యేక ఓటరు నమోదు
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. అర్హులు 6,7,8 ఫారాలు పూర్తిచేసి బీఎల్‌ఓలకు అందించాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలంటీర్లకు కూటమి సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. వలంటీర్లు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా ప్రజలకు చేరుస్తున్నారని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వలంటీర్‌ను కూడా తొలగించం.. వారికి ఇస్తున్న రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలు పెంచే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలు లోకేష్ వరకు అందరూ ప్రతి చోటా మాట్లాడారు. ప్రధానంగా ఈ ఏడాది మే 10న ఏలూరులో జరి గిన ఎన్నికల సభలో చంద్రబాబు వలంటీర్ వ్య వస్థను కొనియాడి జీతం రెట్టింపు చేస్తానని ప్రకటించారు. కట్ చేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను పూర్తిగా విస్మరించడం, చివరికి అసెంబ్లీ సాక్షిగా వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వలంటీర్లు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు.
ప్రణాళికాబద్ధంగా విషం చిమ్ముతూ..
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం అందించే పౌర సేవలను, సంక్షేమ పథకాలను దళారీ వ్యవస్థకు తావులేకుండా వలంటీర్లు గత ప్రభుత్వ హయాంలో సమర్థవంతంగా పనిచేశారు. కరోనా వంటి విపత్తు సమయంలోనూ అద్భుతమైన సేవలందించి దేశ ప్రధాని సైతం వలంటీర్ వ్యవస్థ బా గుందని కితాబు ఇవ్వడంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అమలుచేయడానికి వీలుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరిగాయి. ఇలా దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన వలంటీర్ వ్యవస్థపై ఎన్నికల ముందు నుంచే కూటమి నేతలు ప్రణాళికాబద్ధంగా విషం చిమ్మారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను గత ప్రభుత్వం నియమించి సంక్షేమ పథకాలు మొదలు కోవిడ్ వ్యాక్సిన్ల వరకు సేవలందించింది. ప్రధానంగా గోదావరి వరదల సమయంలో వలంటీర్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఏటా రోజుల తరబడి ఏజెన్సీ ప్రజలు గోదావరి వరదల్లో చిక్కుకుని పునారావస కేంద్రాల్లో ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో వలంటీర్లే మంచినీరు మొదలు ప్రభుత్వ పరిహారం వరకు గంటల వ్యవధిలో లబ్ధిదారులకు అందించా రు. ఇలాంటి బలమైన వలంటీర్ వ్యవస్థకు కూ టమి సర్కారు మంగళం పాడింది.
20 వేల కుటుంబాల భవిత ప్రశ్నార్థకం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 938 గ్రామ సచివాలయాలు, 227 వార్డు సచివాలయాల పరిధిలో 20,482 మంది వలంటీర్లు గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14తో వలంటీర్ వ్యవస్థ గడువు ముగిసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వలంటీర్లకు జీతాలు చెల్లించలేదు. ఎన్నికల ప్రచార సభల్లో జిల్లాకు వచ్చిన చంద్రబా బు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నా రా లోకేష్‌తో సహా స్థానిక ప్రజాప్రతినిధులు వరకు అందరూ వలంటీర్లు దేవుళ్లు అంటూ పొగిడారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి టీడీపీ, జనసేన వలంటీర్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విషం చిమ్మింది. వలంటీర్లతో పాటు ప్రజల నుంచి తారా స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో వెంటనే ప్లేటు ఫిరాయించి వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, ఏ ఒక్కరి ఉద్యోగం కూడా తొలగించమని, రూ.5 వేల నెల జీతాన్ని రూ.10 వేలు చేస్తామని హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి రాగానే వలంటీర్లను విస్మరించారు. జిల్లాస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సందర్భాల్లో ప్రభుత్వం మంచి నిర్ణ యం తీసుకుంటుందంటూ మాటలతో దాటేశారు. తాజాగా అసెంబ్లీ సాక్షిగా మంత్రి లేని వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తాం.. వ్యవస్థే లేదని కుండబద్దలకొట్టినట్లు ప్రకటించడంతో జిల్లాలో 20,482 మంది వలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల క్రమంలో ప్రత్యక్ష పోరుకు వలంటీర్లు సన్నద్ధమవుతున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి, న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై, పాలనపై అత్యంత నీచంగా, అసభ్యకరంగా ఎక్స్‌లో ట్వీట్లు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కోరారు. ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, వైఎస్సార్‌సీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులకు ఆధారాలతో కూడిన ఫిర్యాదును సమర్పించారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరులోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్తలు, నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించుకుంటూ ఉండగా.. తన సెల్‌ఫోన్‌లో ఎక్స్ మాధ్యమంలో జగన్‌ను ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన ట్వీట్లు, మార్ఫింగ్ చేసిన చిత్రాలను పోస్ట్ చేయగా చూశానని తెలిపారు. మంత్రి లోకేష్ ట్విట్టర్ ఐడీతో, ఇతర మంత్రుల ట్విట్టర్ ఐడీలతో అత్యంత దారుణంగా అసత్యాలను ప్రచారం చేస్తూ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా టీడీపీ నేతలు వ్యవహరించటం సరికాదన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ ద్వారా ఈ పోస్టులు తయారుచేస్తూ సోషల్ మీడియా, ఎక్స్ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ, కుట్రలు, కుటిల పన్నాగాలతో పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. కులాలు, మతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు, విభేదాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు.
వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన పోలీస్ అధికారులను కోరారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మున్నుల జాన్‌గురునాథ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలాడి దుర్గారావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, హిస్టరీ అకాడమీ మాజీ డైరెక్టర్ ఎండీ కై సర్, పార్టీ నేతలు ముదుండి సూర్యనారాయణ, లీగల్ సెల్ నాయకులు ప్రత్తిపాటి తంబి, స్టాలిన్, వీరవల్లి లక్ష్మీకుమార్, బుద్దాల రాము, ఫణి, వెంకటేష్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.
● ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్‌మీట్
● ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది
ఏలూరులో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నాయకులు
న్యూస్‌రీల్
కూటమి కుట్ర
వలంటీర్ల వ్యవస్థ మంగళానికి కార్యాచరణ
8 నెలలుగా నిలిచిన జీతాలు
అసెంబ్లీ సాక్షిగా వ్యవస్థను రద్దు చేస్తామని మంత్రి ప్రకటన
ఉమ్మడి పశ్చిమగోదావరిలో 20,482 మంది వలంటీర్లు
జీతం రెట్టింపు చేస్తామని ఎన్నికల సభల్లో కూటమి నేతల హామీలు
ఆందోళనకు సిద్ధమైన వలంటీర్లు
ఉమ్మడి జిల్లాలో..
గ్రామ సచివాలయాలు 938
వార్డు సచివాలయాలు 227
గ్రామ, వార్డు వలంటీర్లు 20,482
ఏలూరులో వలంటీర్ల ధర్నా
ఏలూరు (టూటౌన్): గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్ల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ ఐదేళ్లపాటు ప్రజలకు నేరుగా వలంటీర్లు సేవలందించారని, ఈ ఏడాది జూన్ నుంచి వలంటీర్లకు కూటమి ప్రభుత్వం జీతాలు నిలిపివేసిందని, ఇది సరైన విధానం కాదన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు వలంటీర్లను కొనసాగిస్తామని, వారి జీతాలు రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు పృథ్వీరాజ్, విజయ్, తన్మయ, అశోక్, మణికంఠ, హర్షలత తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment