ఉరిమే ఉత్సాహం
ఏలూరు టౌన్: ఏలూరు లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో వార్షిక స్పోర్ట్స్‌మీట్ ఉ త్సాహంగా సాగింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బెలూన్లు ఎగురవేసి శుక్ర వారం స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పనిభారం, ఒత్తిళ్లతో ప్ర జలకు సేవలు అందించే పో లీసు సిబ్బంది మానసిక, శా రీరక ఉల్లాసంతోపాటు ప్ర తిభను చాటుకునేలా ఏలూ రు జిల్లా పోలీస్ స్పోర్ట్స్‌మీట్–24ను నిర్వహించటం అభినందనీయమన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణలో చాలా సమాయాన్ని క్రీడల ప్రాక్టీస్‌కు వినయోగించేవారమని గుర్తు చేశారు. పోలీసు సిబ్బంది శారీరకంగా దృఢంగా ఉండాలనీ, మానసిక ఆరోగ్యం, ఉల్లాసం ఎంతో అవసరమన్నారు. క్రీడాస్ఫూర్తితో ఆటల్లో రాణించాలన్నారు. పోలీస్ సిబ్బందికి రన్నింగ్, లాంగ్‌జంప్, వాలీబాల్, షాట్‌పుట్ వంటి పలు అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ పీ.శ్రీహరి, ఎస్‌బీ సీఐలు, సీఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment