వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి
బాబోయ్ చలి
చలి పులి ప్రజలను వణికిస్తోంది. నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ భయపెడుతోంది. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 8లో u
పార్టీ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్
కై కలూరు: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికై న వైఎస్సార్‌సీపీ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్ అన్నారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)ను శుక్రవారం ఆయన మర్వాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర పదవి అందించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సహకరించిన డీఎన్నార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, ముదినేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు గోట్రూ ఏసుబాబు, ముదినేపల్లి వైస్ ఎంపీపీ చొప్పర్ల సునీత, నాయకులు పాము రవికుమార్, బత్తిన కిషోర్, గంట సంధ్య, శీలం రామకృష్ణ, గోదావరి సత్యనారాయణ, గంటా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎయిడెడ్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భీమడోలు సీబీసీఎస్ సీ ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉ న్న ఎస్‌జీటీ ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి ద రఖాస్తు గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతో సీబీసీఎస్‌సీ ఎయిడెడ్ పాఠశాలకు వ్యక్తిగతంగా లేదా పోస్టు లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment