ఉత్సాహంగా బాలోత్సవం
భీమవరం: చిన్నారులు విద్యతోపాటు సాంస్కృతిక, కళలు, క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలో బాలోత్సవం రెండో రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పి ల్లల చదువులు, శాసీ్త్రయ దృక్పథం పెంపునకు బాలోత్సవం స్ఫూర్తి అని ఆయన అన్నారు. ఉ పాధ్యాయులు పి.రామభద్రరాజు, జీపీసీ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు జిమ్నాస్టిక్స్‌లో భాగమైన రోప్ స్కిప్పింగ్, మల్లఖంబ్ పోల్ ప్రదర్శనలు నిర్వహించారు. వసుధ ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో విద్యార్థులకు రూ.10 వేల నగదు బ హుమతి అందజేశారు. భీమవరం బాలోత్స వం అధ్యక్షుడు ఇందూకురి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, కారు మూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సత్య సంజీవ్‌కు అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణానికి చెందిన హోమియో వైద్యుడు చిక్కం సత్య సంజీవ్ టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ ది హెల్త్‌కేర్–2024 అవార్డును అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్ర మంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వెంకటరమణ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఆయన్ను పలువురు వైద్యులు, స్నేహితులు, బంధువులు అభినందించారు.
237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇప్పటివరకూ 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లోని 320 రెవెన్యూ గ్రామాలకుగాను 237 గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయన్నారు. సదస్సులకు 12,691 మంది హాజరుకాగా 3,172 ఫిర్యాదులను స్వీకరించామన్నారు. వీటిలో 319 ఫి ర్యాదులను పరిష్కరించామని చెప్పారు. సదస్సుల్లో అందిన దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరిస్తామన్నారు. జనవరి 8 వరకు సదస్సులు జరుగుతాయని తెలిపారు. భూ సంబంధ, రెవెన్యూ పరంగా మ్యూటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల జారీ, పట్టాదారు పాస్‌పుస్తకాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ చెప్పారు.
10న ఎస్సీ కులగణనపై జాబితా ప్రదర్శన
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఎస్సీ కులగణనపై జనవరి 10న తదిత జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోని సచివాలయాల్లో నోటీసు బోర్డులో జాబితా అందుబాటులో ఉంచామని, దీనిపై ఈనెల 31న వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అర్జీల ఆధారంగా ఆన్‌లైన్‌లో మా ర్పులు, చేర్పులు, వివరాల పరిశీలనకు జన వరి 6న తుది గడువుగా నిర్ణయించామన్నారు. మార్పులు, చేర్పులు అనంతరం కులం వారీగా జాబితాలను సచివాలయాల్లో జనవరి 10న ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment