నిబంధనలుమీరితేఉపేక్షించం
భీమవరం : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అసాంఘిక, అనుచిత, అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జిల్లా అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, రో డ్డు కూడళ్లలో ఎక్కువ మంది గుమిగూడటం, బహిరంగంగా పార్టీలు, భారీ శబ్ధాలతో లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టడం నిషేధమన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్, కార్ రేసింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకల పేరుతో రౌడీయిజం చేసినా, దురుసుగా ప్రవర్తించినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, ప్రజారవాణాకు అడ్డంకులు సృష్టించేలా వాహ నాలు నడపినా ఉపేక్షించబోమన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి
వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర అవుట్‌లెట్లు, వ్యా పార సముదాయాలు నిర్దేశిత సమయంలో మూసివేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాలను సైతం సీజ్ చేస్తామన్నారు. జిలావ్యాప్తంగా డీఎస్పీల పర్య వేక్షణలో అన్ని ముఖ్య కూడళ్లలో మంగళవారం సా యంత్రం నుంచి పోలీస్ పికెట్స్, నైట్ గస్తీ బృందాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. నిరంతర నిఘా ఉంటుందని, వాహన తనిఖీలు చేపడతామని చె ప్పారు. ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరించాలని ఎస్పీ కోరారు.
జిల్లా ఎస్పీ నయీం అస్మి
Comments
Please login to add a commentAdd a comment