దత్తతకు అనుమతి తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): అనుమతి లేని పిల్లల దత్తతను ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ సీహెచ్ నా గరాణి హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి కార్యక్రమాల కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. దత్తతకు జిల్లాలో ఆరు దరఖాస్తులే అందడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కలగరు అనే దంపతులకు అవగాహన కల్పించి దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. బాల్యవివాహాలను ని రోధించాలన్నారు. మూడో అడిషనల్ జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎంఏ సోమశేఖర్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అకృత్యాలను నిరోధించడం సామాజిక బాధ్యత అని, అధికారులంతా సమష్టిగా కృషిచేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరో ధక చట్టంపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. గరగపర్రు బ స్టాండ్ పక్కన ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించి నివేదిక అందించాలని ఆర్డీఓను ఆదేశించారు. అలాగే మ్యాన్యువల్ స్కావెంజర్ నిషేధ, పునరావాస చట్టానికి సంబంధించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment