జాతీయస్థాయి ఉత్తమ నాటికగా (అ)సత్యం
వీరవాసరం: శ్రీకృష్ణదేవరాయ నాటిక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుంచి రాయకుదురులో నిర్వహిస్తున్న పంచమ జాతీయస్థాయి నాటిక పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతల వివరాలను ప్రకటించి బహుమతులను అందజేశారు. మొదటి ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి ఉక్కునగరం వారి (అ)సత్యం నాటిక సాధించగా, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శార్వాణీ ఫైన్ ఆర్ట్స్ బోరువంక వారి కొత్తపరిమళం నాటిక, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నటీనట సంక్షేమ సమైఖ్య పాలకొల్లువారి శ్రీఅనూహ్యంశ్రీ నాటికలు నిలిచాయని కళాపరిషత్ అధ్యక్షుడు గోపాలకృష్ణ కేఎస్‌ఆర్‌కే తెలిపారు. ఉత్తమ దర్శకత్వం (అ)సత్యం నాటికకు బాలాజీ నాయక్, ఉత్తమ రచనగా పిన్నమనేని మృత్యంజయరావు, ఉత్తమ నటుడు కొత్తపరిమళం నాటిక డాక్టర్ గోపాల్ పాత్రధారి మెట్టా పోలినాయుడు, ఉత్తమ నటి మలిసంథ్య నాటికలోని సంధ్యా పాత్రధారి జ్యోతిరాణి, ఉత్తమ క్యారెక్టర్ నటుడు చిగురుమేఘం నాటికలోని చెన్నయ్య పాత్రధారి కావూరి సత్యనారాయణ, ఉత్తమ ప్రతినాయకుడు కొత్తపరిమళం నాటికలోని ఉస్మాన్‌ఖాన్ పాత్రధారి ఎన్ వెంకట్రాజు, ఉత్తమ హాస్యనటుడు అనూహ్యం నాటికలోని ధనుష్కోటి పాత్రధారి గుడాల హరిబాబు, ద్వితీయ ఉత్తమ నటుడు విడాకులు కావాలి నాటికలోని శ్రీనివాసరావు పాత్రధారి గంగోత్రి సాయి, ఉత్తమ సంగీతం కొత్తపరిమళం నాటిక డీ రాజశేఖర్, ఉత్తమ రంగాలంకరణ చిగురు మేఘం నాటిక రామ్మోహన్, ఉత్తమ ఆహార్యం కొత్తపరిమళం నాటికలోని ఎస్ రమణ ఎంపికయ్యారు. న్యాయ నిర్ణేతలుగా అల్లు రామకృష్ణ, కొడమంచిలి సత్యప్రసాద్, గంటా ముత్యాలరావు నాయుడు వ్యవహరించారు. ముందుగా మందుల స్మారక రంగస్థలం నటరత్న అవార్డుతో గంగోత్రి సాయిని సత్కరించారు. గోటేటి ప్రసాద్ శ్రీనివాసరావుల స్మారక నటరత్న అవార్డు కత్తుల రామ్మోహనరావుకు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది జీ శివకుమార్, గోటేటి శ్రీనివాసరావు, సర్పంచ్ గెడ్డం భారతీ, చవ్వాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు
కళాకారులకు సత్కారాలు
Comments
Please login to add a commentAdd a comment