సంక్రాంతి బండి.. ఆదాయం దండి
భీమవరం(ప్రకాశం చౌక్): సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల ద్వారా పశ్చిమ ఆర్టీసీ గణనీయమైన ఆదాయం గడించింది. 10 రోజుల్లో రూ.99.51 లక్షల రాబడి వచ్చింది. జిల్లాలోని నాలుగు డిపోల్లో మొత్తంగా 434 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. ఈనెల 9 నుంచి 12 వరకు, పండుగ తర్వాత 15 నుంచి 20 తేదీ వరకు ఈ సర్వీసులు నడిచాయి. సాధారణ చార్జీలనే వసూలు చేయడంతో ఆదరణ బాగుంది. జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా, సూపర్ లగ్జరీ, ఇంద్ర బస్సులను నడిపారు. ఆయా బస్సులను బట్టి రూ.710 నుంచి రూ.930 చార్జీలు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీల దోపిడీకి చెక్ పెట్టారు.
2022 నుంచి.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2022 నుంచి సంక్రాంతికి ఆర్టీసీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకంగా సంక్రాంతి సర్వీసులకు సాధారణ చార్జీలను వసూలు చేయాలని అప్పటి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే నిర్ణయాన్ని ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోంది. సంక్రాంతికి జిల్లాలో 2022లో రూ.36.88 లక్షలు ఆదాయం రాగా, 2024లో రూ.70 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గతేడాది కంటే రూ.29 లక్షలకు పైగా అధిక ఆదాయం లభించింది.
భీమవరం ఫస్ట్ : ఈనెల 9 నుంచి 12 వరకు ప్ర త్యేక సర్వీసుల ద్వారా రూ.42,98,000, పండుగ త ర్వాత ఈనెల 15 నుంచి 20 వరకు రూ.56,52,000 మొత్తంగా రూ.99,51,000 ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది. భీమవరం డిపో రూ 37.73 లక్షలతో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆర్టీసీకి రూ.99.51 లక్షల రాబడి
10 రోజులు.. 434 ప్రత్యేక సర్వీసులు
గతేడాది కంటే రూ.29 లక్షలు అధికం
డిపో బస్సులు ఆదాయం
(రూ.లలో)
భీమవరం 164 37,73,911
తాడేపల్లిగూడెం 59 13,26,202
నరసాపురం 103 25,12,625
తణుకు 108 23,38,429
ఆదరణ బాగుంది
సంక్రాంతి ప్రత్యేక సర్వీసులకు ఆదరణ బాగుంది. హైదరాబాద్‌కు పండుగ ముందు, తర్వాత ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశాం. పెద్ద ఎత్తున ప్రజలు కుటుంబ సమేతంగా జిల్లాకు తరలివచ్చారు. ప్రజలు ఆర్టీసీ సేవలను బాగా ఉపయోగించుకున్నారు.
– ఎన్‌వీఆర్ వరప్రసాద్, జిల్లా ప్రజా రవాణా అధికారి
Comments
Please login to add a commentAdd a comment