కళలు సంస్కృతిలో భాగం | - | Sakshi
Sakshi News home page

కళలు సంస్కృతిలో భాగం

Published Fri, Jan 24 2025 12:31 AM | Last Updated on Fri, Jan 24 2025 12:36 AM

కళలు సంస్కృతిలో భాగం

కళలు సంస్కృతిలో భాగం

ఉండి: కళలు, కళాకారులను గౌరవించడం, వారిని ప్రోత్సహించడం మన సంప్రదాయమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మండలంలోని కోలమూరులో సంతానగోపాలస్వామి ఆలయం, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలను బుధవారం అర్ధరాత్రి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థల కళాకారులను ఆదరించాలని, జాతరలు, ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో నాటకాలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం సురభి నాట్యమండలి ప్రధాన కళాకారుడు ఆర్‌.వేణుగోపాలరావును కేంద్రమంత్రి స త్కరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరిచర్ల సుభాష్‌రాజు పాల్గొన్నారు. నాటకోత్సవాల్లో చివరిగా గురువారం రాత్రి శ్రీనివాసకల్యాణం అనే నాటకాన్ని ప్రదర్శించారు. కేంద్ర మంత్రిని ని ర్వాహకులు సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement