సైన్స్ పోటీలతో శాస్త్రీయ ఆలోచనలు
భీమవరం: సైన్స్ ప్రయోగ పోటీల ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు, సైన్స్‌పై అభిరుచి పెంపొందించవచ్చని డీఈఓ ఈ.నారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగ పోటీల పోస్టర్‌ను విడుదల చేశారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు మా ట్లాడుతూ పోటీలు ప్రారంభమయ్యాయని, వచ్చేనెల 15 వరకు కొనసాగుతాయన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం–సుస్థిర అభివృద్ధి, మూఢనమ్మకాలు–శాసీ్త్రయ దృక్ప థం అంశాల్లో పోటీలుంటాయన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రామలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
1 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధం
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో వచ్చేనెల 1 నుంచి క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ టీ కప్పుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో అ ధికారులతో ఆమె సమీక్షించారు. పట్టణాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. తొలి అడుగుగా కలెక్టరేట్‌లో వాటర్ బాటిల్స్, డిస్పోజబుల్ ప్లేట్లు, టీ గ్లాసుల స్థానంలో స్టీల్ సామగ్రిని వినియోగిస్తున్నామన్నారు. వచ్చేనెల నుంచి పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ టీ గ్లాసులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను మంగళగిరి లోని ఏపీ జ్యూడీషియల్ అకాడమీకి డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పురుషోత్తంకుమార్ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించకపోవడంతో ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జిగా పనిచేస్తున్న సునీల్‌కుమార్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
స్టీల్‌ప్లాంట్‌కు నిధులు
భీమవరం: రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌ రవించి విశాఖలోని స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గురువారం భీమవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు ప్రకటించిన ప్యాకేజీలో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్‌గా, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌గా కేటాయించినట్టు వివరించారు. మేనేజ్‌మెంట్‌లో లోపాలను సరిచేసుకుని నడపాలని, ప్యాకేజీలో ఉద్యోగులు, కార్మికుల జీతాల చెల్లింపునకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఏం మాట్లాడుతోందో ఆమెకే స్పష్టత లేదని మంత్రి ఎద్దేవా చేశారు.
బాలికల హక్కులను కాపాడాలి
ఏలూరు (టూటౌన్): బాలికల హక్కులు కాపాడటం అందరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రో చైల్డ్ గ్రూప్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్‌రైట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. బాలికల బంగారు భవిష్యత్తు కోసం వారి భద్రత ఆరోగ్యం విద్యపై ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జేసీ కోరారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతల రమేష్‌బాబు, కోశాధికారి జాగర్లమూడి శివకృష్ణ, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (క్రాప్) జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్.రవిబాబు న్యాయవాది చిక్కా భీమేశ్వర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment