ఏలూరు జీజీహెచ్‌లో రూ.30 లక్షలతో పనులు
యువకుడి దుర్మరణం
హనుమాన్ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. లారీని బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. IIలో u
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామనీ, భద్రతా చర్యల మెరుగుకు చర్యలు చేపట్టినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు తెలిపారు. ‘సాక్షి’లో గురువారం ‘జీజీహెచ్‌లో భద్రతపై ఆందోళన’ శీర్షికన ప్రచురించిన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో భద్ర తా చర్యలపై సమీక్షించిన సూపరింటెండెంట్ రాజు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ఆస్పత్రి ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
రూ.30 లక్షలతో పనులు
జీజీహెచ్‌లో సీసీ కెమెరాల పనితీరును మరింత పెంచటంతోపాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పా టు చేస్తామనీ, హాస్పిటల్ ప్రాంగణంలో చీకటి లేకుండా వీధి దీపాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు డీఎంఈకు పంపామని సూపరింటెండెంట్ రాజు తెలిపారు. ఈ మేరకు పనులకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏ ర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ దీపాల ఏర్పాటుకు సుమారు రూ.7.33 లక్షలు, అత్యాధునిక సీసీ కెమెరాలు, సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటుకు రూ.16.50 లక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment