సాహిత్యంతో సమాజ హితం
భీమవరం(ప్రకాశం చౌక్): సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని, సాహిత్యానికి కులమతాలు ఉండవని పిఠాపురం శ్రీవిశ్వ విజ్ఞాన, విద్య, ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవనంలో కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 80వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామ బ్రహ్మంకు డాక్టర్ ఉమర్ ఆలీషా పురస్కారం, రూ.50,116 నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ సాహితీ సమితి ద్వారా భీమవరంలో 32 ఏళ్లుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భీమవరం వేదికగా సాహిత్య రంగంలో రాణిస్తున్న వారికి ఉమర్ ఆలీషా పురస్కారం అందిస్తున్నారన్నారు. చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహానీయులు కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా అని చెప్పా రు. సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రాజీ, ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment