భూముల విలువ పెంపునకు ఆమోదం
భీమవరం: జిల్లాలోని భూముల మార్కెట్ విలువ పెంపుదలకు సమర్పించిన ప్రతిపాదనల తుది జాబితాను ఆమోదించినట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదన్నారు. జిల్లాలో భూముల విలువలను 10 శాతం నుంచి 20 శాతం వరకు పెంచుతున్నామని, వచ్చేనెల 1 నుంచి ఈ విలువలు అమలులోకి వస్తాయన్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఎల్.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, 15 మంది సబ్ రిజిస్ట్రార్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment