ఘనంగా ఓటర్ల దినోత్సవం
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు వేసేలా ప్రోత్సహించడమే ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించా రు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీని యర్ సిటిజన్లను సత్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన, వక్తృత్వం పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ అప్పారావు, డీఈఓ ఈ.నారాయణ పాల్గొన్నారు.
టీసీసీ సర్టిఫికెట్లు వచ్చాయ్
భీమవరం: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల (టీసీసీ) పాస్ సర్టిఫికెట్లు భీమవరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పొందవచ్చని డీ ఈఓ ఈ.నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ జరిగిన డ్రాయింగ్ లోయర్, హయ్యర్, టైలరింగ్ పరీక్షల పాస్ సర్టిఫికెట్లు పొందవచ్చన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో సంప్రదించాలని కోరారు.
రేపు నిధి ఆప్ కే నికత్
రాజమహేంద్రవరం రూరల్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి నిధి ఆప్ కే నికత్–జిల్లా ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఏలూరులోని శనివారపుపేట పీఏసీఎస్, పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం సింగంపల్లి పీఏసీఎస్‌లో శిబిరాలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment