భువనగిరి ఆస్పత్రి ఎదుట వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

భువనగిరి ఆస్పత్రి ఎదుట వ్యక్తి మృతి

Published Wed, Nov 20 2024 1:13 AM | Last Updated on Wed, Nov 20 2024 1:13 AM

-

భువనగిరి క్రైం: భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బస్టాప్‌ వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద లభించిన ఐడీ కార్డులో మరిచెట్టి నాగేంద్ర గణేశ్‌, వయస్సు 38 సంవత్సరాలు, ఇంటి నం. 17–3–1/7/1/అ, జవహర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్‌, హైదరాబాద్‌ అని ఉంది. మృతుడు ఈ నెల 13వ తేదీన ప్రమాదవశాత్తు రైలులో నుంచి కింద పడిపోగా రైల్వే పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అతడిని డాక్టర్‌ పరిశీలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు రిఫర్‌ చేయగా అతడు హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల తిరుగుతూ మృతిచెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపారు. మృతుడి వివరాలకు 8712579973, 8712662803 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement