నల్లగొండ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులపై సోమవారం రాత్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రామచంద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2020 బ్యాచ్‌కు చెందిన నలుగురు విద్యార్థులు, 2019 బ్యాచ్‌కు చెందిన ఒక విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లను గోడ కుర్చీ వేయించినట్లు యాంటి ర్యాగింగ్ కమిటీ విచారణలో తేలడంతో వైస్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నరాఉ. మెడికల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డాడని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. కళాశాలలో ర్యాగింగ్ జరిగితే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment