కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నల్లగొండ క్రైం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని నీలగిరి కాలనీలో మంగళవారం జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. కనగల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన బైరోజు పూర్ణచంద్రచారి(40) నల్లగొండ పట్టణంలోని నీలగిరి కాలనీలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో మంగళవారం పూర్ణచంద్రచారి తాను ఉంటున్న అద్దె ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సైదులు తెలిపారు.
ఇద్దరు రేషన్ డీలర్లపై
కేసు నమోదు
చిలుకూరు: అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన ఇద్దరు రేషన్ డీలర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన రేషన్ డీలర్లు ఓరుగంటి లక్ష్మీనరసింహరావు, గిజ్జి సువర్ణ రేషన్ లబ్ధిదారుల వద్ద నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి వారి ఇళ్లలో నిల్వ ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం చిలు కూరు పోలీసులు తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోదాడ సివిల్ సప్లై ఆర్‌ఐ కృష్ణారెడ్డి పంచనామా చేశారు. లక్ష్మీనరసింహరావు ఇంట్లో 60 బస్తాల్లో 30 క్వింటాళ్లు, సువర్ణ ఇంట్లో 32 బస్తాల్లో 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం దొరికినట్లు ఆర్‌ఐ తెలిపారు. దొరికిన రేషన్ బియ్యాన్ని గ్రామంలోని మరో రేషన్ డీలరుకు అప్పగించినట్లు పేర్కొన్నారు. సివిల్ సప్లై ఆర్‌ఐ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఇద్దరు రేషన్ డీలర్లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment