పాము కాటుకు గురైన గురుకుల విద్యార్థి
కేతేపల్లి: గురుకుల పాఠశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఈ ఘటన కేతేపల్లి మండలం మూసీ బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం సాయంత్రం జరిగింది. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన బద్దం చంద్రశేఖర్, అనిత దంపతుల కుమారుడు గణేష్ కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద గల జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతూ పాఽఠశాల వసతి గృహంలో ఉంటున్నాడు.. మంగళవారం సాయంత్రం గణేష్ కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు వసతి గృహం సమీపంలో ఉన్న మరుగుదొడ్ల వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది. దీంతో తోటి విద్యార్థులు కేకలు వేస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ ధనమ్మకు విషయం తెలియజేశారు. వెంటనే గణేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం అతడిని నకిరేకల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేతేపల్లి ఎంఈఓ ఆకవరం రాజేంద్రప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఫ నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో
చికిత్స పొందుతున్న బాలుడు
Comments
Please login to add a commentAdd a comment