రామన్నపేట: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు సంబంధించి సోషల్ ఆడిట్ నివేదికలో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కలకు, క్షేత్రస్థాయిలో బతికిఉన్నవాటి సంఖ్యలో తేడా ఉన్న ట్లు, హాజరు మస్టర్లలో కొట్టివేతలు, అధికారుల పాస్‌ఆర్డర్ లేకుండానే పేమెంట్లు చేసినట్లు గుర్తించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు అధికారి సురేష్, ఎంపీడీఓ యాకుబ్‌నాయక్, విజిలెన్స్ జిల్లా అధికారి ఉపేందర్‌రెడ్డి, సహాయ విజిలెన్స్ అధికారి ఆదిత్యవర్ధన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment