భువనగిరి క్రైం : బాలల హక్కులను సద్వి నియోగం చేసుకుని, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోం బాలురకు బాలల హక్కులపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గురువారం బహుమతుల ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులు, విద్యాహక్కు చట్టం, బాలకార్మిక చట్టాలపై బాలలకు అవగాహన కల్పించాలని గ్రేస్ చిల్డ్రన్ హోం నిర్వాహకులకు సూచించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment