డేటా ఎంట్రీలో తప్పులకు తావుండవద్దు
సాక్షి,యాదాద్రి : సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో న మోదు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సర్వేలో సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఎన్యుమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే వివరాలు గోప్యంగా ఉంచాలని, దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి 500 మంది, భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో వివరాలు ఆన్‌లైన్ చేయడానికి 800 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో యాదాద్రి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐదవ స్థానంలో ఉందని, ఎన్యుమనేటర్లకు ప్రజలు సహకరించడం వల్ల సర్వే వేగంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి శామ్యూల్, ఏడీఎం సాయికుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment