![బాలకార్మికులకు విముక్తి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/08012025-ydd_tab-01_subgroupimage_1330375664_mr-1736282516-0.jpg.webp?itok=ac-7QdSt)
బాలకార్మికులకు విముక్తి
చౌటుప్పల్ రూరల్: బాలకార్మికుల వ్యవస్థను కట్టడి చేసేందుకు రాచకొండ పోలీసులు ఆపరేషన్ స్మైల్ 11 కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో బిల్డింగ్ ప నులు చేస్తున్న ఓ బాలుడిని, బేకరి, మెకానిక్ షా పులో పని చేస్తున్న ఇద్దరు బాలుల్ని పోలీసులు గుర్తించి బాలల సంక్షేమ శాఖ అధికారులకు అ ప్పగించారు. బాలకార్మికులతో పని చేయిస్తున్న యాజమానులు మెకానిక్ గౌస్, బేకరి నిర్వాహకులు కేసబోయిన సత్యనారాయణ, బి ల్డింగ్ నిర్మాణ పనులు చేయిస్తున్న కంది బాల్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు.
పైప్‌లైన్ పనుల పరిశీలన
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో రూ.12 కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పనులను మంగళవారం పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, డీఈ మనోహర్ పరిశీలించారు. వారి వెంట పబ్లిక్ హెల్త్ ఈఈ సురేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఉన్నారు.
నేటి నుంచి చతురాయన సహిత చండీయాగం
ఆలేరురూరల్: ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో గల శ్రీమాతా పితృ గోక్షేత్రంలో బుధవారం నుంచి 12వ తేదీ వరకు చతురాసన సహిత శత చండీయాగం నిర్వహించనున్నట్లు చండీయాగం నిర్వాహకులు పులి సీతారామశర్మ మంగళవారం తెలిపారు. ఈ యాగాన్ని హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 9న శ్రీలక్ష్మీనారసింహ, సుదర్శన, పవమాన హోమం, 10న అరుణ సరస్వతి స్వామిజీ అనుగ్రహ భాషనం, 11న రుద్ర హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నేడు కేంద్ర బృందం పర్యటన
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిలో బుధవారం నేషనల్ హెల్త్‌మిషన్ (న్యూఢిల్లీ) అధికారుల బృందం పర్యటించనుంది. పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంతో పాటు ముక్తాపూర్‌లో ఎన్‌సీడీ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం అమలును పరిశీలించనున్నట్లు మండల వైద్యాధికారిణి శ్రీవాణి మంగళవారం తెలిపారు.
పోరాటాల ఫలితంగానే మంత్రి హామీ
భువనగిరి: ఏఐటీయూసీ ఫోరాటాల ఫలితంగానే సివిల్ సప్లయ్ హమాలీల సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తమ్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. సివిల్ సప్లయ్ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజుల నుంచి చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం పట్టణంలోని గోడౌన్ వద్ద బియ్యం సప్లయ్‌ని వారు అడ్డుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జరిగిన సమావేశంలో మంత్రి ఇచ్చిన హామీతో వారు సమ్మె విరమించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సాలమ శోభన్‌బాబు, సివిల్ సప్లయ్ హమాలీ కార్మిక భువనగిరి పాయింట్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయం చూపాలి
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలో చేపట్టిన అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, జిల్లా కార్యదర్శి ఆలె చిరంజీవి డిమాండ్ చేశారు. చిరువ్యాపారులతో కలిసి మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్, మండల అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, మల్లేషం, భూపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అశోక్, జంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment