గాంధీ మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం
చౌటుప్పల్: మహాత్మాగాంధీ చూపిన మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామన్నారు. చరకా ప్రదర్శన, బాల గాంధీ వేషధారణ, గాంధీజీ 500 విగ్రహాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, మల్కంబ్, యోగా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మండల అధ్యక్షురాలు వెన్‌రెడ్డి సంధ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీబీ కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉజ్జిని మంజుల, కోశాధికారి పోలోజు శ్రీలత, ప్రతినిధులు బొబ్బిళ్ల సంధ్య, ముటుకుల్లోజు నీరజ, జయ, పద్మావతి, ఝాన్సీరాణి, మమత, రజిత, అయిలమ్మ, రమాదేవి, అనూష, షామిని, సువర్ణలక్ష్మి, కీర్తన, నవనీత పాల్గొన్నారు.
ఫ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment