వైద్యశాఖ అప్రమత్తం
ఆందోళన చెందొద్దు
హెచ్‌ఎంపీవీతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా అప్రమత్తంగా ఉండడం మంచిది. హెచ్‌ఎంపీవీ వల్ల జలుబు, జ్వరం, ముక్కుదిమ్మడ, శ్వాసకోస సంబంధ సమస్యలు ఉంటాయి. జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఈ వైరస్‌తో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ సూచించింది.
– డాక్టర్ మనోహర్, డీఎంహెచ్‌ఓ
భువనగిరి: హెచ్‌ఎంపీవీ(హ్యూమన్ మెటా నిమో వైరస్) ఇప్పుడు అంతటా ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ అంత ప్రమాదకరం కానప్పటికీ ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈమేరకు పాటించాల్సిన జాగ్రత్తలను జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు.
హెచ్‌ఎంపీవీ లక్షణాలు
హెచ్‌ఎంపీవీ సోకితే జలుబు, జ్వరం, దగ్గు, ముక్కుదిమ్మడ, శ్వాసకోశ వ్యవస్థలో సమస్య వస్తాయి. ఈ లక్షణాలు 3 నుంచి 6 రోజుల్లో కనిపిస్తాయి. ఈ వైరస్ చలి కాలంలో వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దగ్గు, తుంపర్లు, తుమ్మడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ హెచ్‌ఎంపీవీ నేపథ్యంలో జిల్లా
అధికారులను అప్రమత్తం
చేసిన వైద్యశాఖ
ఫ అంత ప్రమాదకరం కానప్పటికీ
జాగ్రత్తలు పాటించాలని సూచన
Comments
Please login to add a commentAdd a comment