మున్సిపాలిటీలకు ఊరట
భువనగిరిటౌన్: మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం ఈ నెల 27న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నిధులు ఏయే పనులకు ఖర్చు చేయాలో గైడెన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.
గతంలో
4శాతం నిధులు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్ డ్యూటీని గతంలో 4 శాతం స్థానిక సంస్థల ఖాతాల్లో నేరుగా జమ చేసేవారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిధులను మున్సిపాలిటీలకు ఇవ్వకుండా ప్రభుత్వం నేరుగా తీసుకుంది. ఆ తరువాత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో ప్రతినెలా కొన్ని నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. వీటితో ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాలను నిలిపివేశారు. దీంతో నిధులులేక మున్సిపాలిటీల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికే పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఫ విడుదల కానున్న
స్టాంప్ డ్యూటీ నిధులు
ఫ ఏయే పనులకు ఎన్ని నిధులు
ఖర్చు చేయాలో జారీ కానున్న
ఉత్తర్వులు
మున్సిపాలిటీల వారీగా జమకానున్న నిధులు ఇలా..
మున్సిపాలిటీ నిధులు
భువనగిరి రూ. 25కోట్లు
మోత్కూర్ రూ.1.52 కోట్లు
చౌటుప్పల్ రూ. 11.96 కోట్లు
ఆలేరు రూ. 3.98 కోట్లు
పోచంపల్లి రూ. 4.70 కోట్లు
యాదగిరిగుట్ట రూ. 3.11 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment