బీసీల త్యాగాలు వెలకట్టలేనివి
యాదగిరిగుట్ట: స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ బీసీల త్యాగాలు, పోరాటాలు వెలకట్టలేనివని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందేలా వారిని చైతన్యం చేసేందుకు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో కార్యనిర్వాహకుడు కటకం నర్సింగ్‌రావు అధ్యక్షతన మన ఆలోచన – సమాలోచన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ.. విద్యావంతులు, సమాజాన్ని పరివర్తన వైపు నడిపించే వారు, మేధావులు, రాజకీయాల్లో ఉన్న బీసీలు ఒకటి కావాలని పిలుపునిచ్చారు. వృత్తి కులాల వారంతా ఏకమై మనలోని లోపాలను తొలగించుకుంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. బీసీలు ఓటు విలువ తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో మరో ఉద్యమం జరగాలని, అది బీసీ ఉద్యమం కావాలన్నారు. సామాజిక తెలంగాణ కోసం సమర శంఖం పూరించడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు దోహదపడుతాయన్నారు. శిబిరం సంచాలకులుగా గడ్డం నర్సింహగౌడ్, అంశాల ప్రముఖ్‌గా దొంత ఆనందం, ప్రముఖ్‌గా దేవేందర్‌జీ వ్యవహరించారు. శిబిరంలో ప్రొఫెసర్ శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కొంగ వీరస్వామి, వీజీఆర్ నారగోని, విద్యా వెంకట్, వెంకటనారాయణ, పిడికిలి రాజు, చింత స్వామి, ఒంటెద్దు నరేందర్, పూజ నర్సింహ, బత్తుల సిద్దేశ్వర్, గుండ్ల ఆంజనేయులుగౌడ్, పంతుల మధుబాబు, కొమురయ్య, వేమునూరి మురళీధర్‌చారి, సింగజ్యోగి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, దశరథ్ సాగర్, సిలివేరు శంకర్ ప్రజాపతి, బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోలగోని శ్రీనివాస్‌గౌడ్, పెండ్యం లక్ష్మణ్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యామల యాదగిరి వంశరాజ్, బాలరాజు పాల్గొన్నారు.
ఫ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
Comments
Please login to add a commentAdd a comment