గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్: గురుకులాల్లో ప్రవేశానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు బుధవారం తెలిపారు. 2025–26కు సంబంధించి వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుందని పేర్కొన్నారు. గురుకులాల్లో విద్యనభ్యసించాలనుకునే వారు tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశానికి, గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో 9వ తరగతిలో ప్రవేశాలకు, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకులం, పరిగిలో ఎస్‌ఓఈలో 8వ తరగతిలో ప్రవేశానికి, అలుగునూరులోని సీఓఈలో 9 వ తరగతిలో అడ్మిషన్ల కోసం, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో 6 వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వ్యాక్సిన్ నిల్వల
రికార్డుల పరిశీలన
ఆత్మకూరు(ఎం): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ నిల్వల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని వ్యాక్సినేషన్ జిల్లా అధికారి డాక్టర్ రామకృష్ణ అన్నారు. బుధవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఐఎల్‌ఆర్, డీఎఫ్ యూనిట్ల నిర్వహణ, ఊష్ణోగ్రతల లాగ్, వ్యాక్సిన్ నిల్వలు, కాలపరిమితి నిబంధనలు, కోల్డ్ చైన్ వ్యవస్థను సమీక్షించారు. యూపీఐ సెషన్ల నిర్వహణలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, సీహెచ్‌ఓ కరుణాకర్, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ఓల్డేజ్ హోమ్స్‌ను
పటిష్టంగా నిర్వహించాలి
భువనగిరి, బొమ్మలరామారం: ఓల్డేజ్ హోమ్స్‌ను నిర్వాహకులు పటిష్టంగా నిర్వహించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామ పరిధిలో ఉన్న షిర్డి సాయి వమోవృద్ధుల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ న్యాయ సేవా పథకం రూపొందించిన, బాలల హక్కులు, బాలికల న్యాయ సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ జైపాల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శంకర్, హోమ్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. అదేవిధంగా బొమ్మలరామారం మండలంలోని గ్రేట్ ఇండియా కమిషన్ బాల బాలికల సంరక్షణ కేంద్రంతో పాటు తుర్కపల్లి మండలంలోని ఆదరణ బాలల సంరక్షణ కేంద్రాలను జిల్లా న్యాయ సేవ అధికార సంస్ధ కార్యదర్శి వి.మాధవిలత సందర్శించారు.
క్రైస్తవ మహిళలు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరిటౌన్: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు ఆసక్తి గల వారు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్‌చార్జ్ అధికారి యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులు www.tgo bmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
11 నుంచి టెక్నికల్ కోర్సు పరీక్షలు
భువనగిరి: టెక్నికల్ కోర్సు పరీక్షలు ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి పట్టణంలోని బీచ్‌మహల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ కోర్సుల లోయర్, హయ్యర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment