చేనేత రుణాలు మాఫీ చేసి తీరుతాం
భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసి తీరుతామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం పోచంపల్లి టై అండ్ డై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘం 47వ సర్వసభ్య సమావేశాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గండి చెరువు వద్ద ఉన్న శ్రీరంగనాయకస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్‌రెడ్డి రూ. 272 కోట్ల త్రిఫ్ట్ నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేత రుణమాఫీ జరిగిందని, నేడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా రుణమాఫీకి సానుకూలంగా ఉన్నారన్నారు. చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. త్వరలో చేనేత అభయహస్తం కింద సంక్షేమ పథకాలు అమలు చేయనున్నామని తెలిపారు. యునెస్కో చేనేత ఉత్తమ పర్యాటక కేంద్రంగా అవార్డు పొందిన పోచంపల్లిలో రూ.9.50 కోట్లతో మినీ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు సంఘం వార్షిక నివేదికను చదివి వినిపించారు. సమావేశంలో టై అండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మిశ్రీనివాస్, రాష్ట్ర చేనేత నాయకులు బడుగు దానయ్య, తడక వెంకటేశ్వర్లు, గర్దాస్ బాలయ్య, కర్నాటి ధనుంజయ్య, అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, సీత శ్రీరాములు, భారత వాసుదేవ్, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, సూరెపల్లి రవీందర్, రాపోలు శ్రీనివాస్, భోగ విష్ణు, టై అండ్ డై అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ముస్కూరి నర్సింహ, గౌరవ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, ఉపాధ్యక్షుడు ఈపూరి ముత్యాలు, రాంనర్సింహ, కోశాధికారి రమేశ్ పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment