సోలార్ ప్లాంట్ ప్రక్రియ వేగవంతం చేయాలి
సాక్షి,యాదాద్రి: స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘం సభ్యుల ద్వారా దేవాలయ, ప్రభుత్వ భూముల్లో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు మోత్కూరు మున్సిపాలిటీ పరిధి బుజలాపురంలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భూమిని పరిశీలించి ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగతా ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజ, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ సుధీర్, ఎలక్ట్రిసిటీ డీఈ శ్రీనివాస్‌చారి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment