జూదరుల అరెస్ట్
వేములపల్లి: పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడిచేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం రావులపెంట గ్రామ శివారులోని పశువైద్యశాల వద్ద ఐదుగురు ట్రాక్టర్ డ్రైవర్లు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1500 నగదు, 5 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
వేములపల్లి: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన కూరెల్లి విజయ్ రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం విజయ్ ఉద్యోగం పోవడంతో మనస్తాపానికి గురైన అతడు ఈ నెల 10వ తేదీ ఉదయం నీళ్లు తీసుకొస్తానని స్కూటీపై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. విజయ్ భార్య, బంధువులు అతడి కోసం వెతుకుతున్న క్రమంలో వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి వద్ద అతడి స్కూటీ కనిపించింది. నాలుగు రోజులుగా కాల్వ వెంట గాలిస్తున్నప్పటికీ విజయ్ ఆచూకీ లభించలేదు. విజయ్ భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని
వ్యక్తి మృతదేహం లభ్యం
డిండి: మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో చెక్‌డ్యాం వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెక్‌డ్యాం నీటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెక్‌డ్యాం నీటిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment