స్వర్ణగిరిలో చినజీయర్ పూజలు
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రాన్ని శనివారం చినజీయర్ స్వామి ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం తిరువీధి ఉత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, నక్షత్ర హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళ శాసనాలతో పాటు ప్రవచనాల గురించి భక్తులకు వివరించారు. అంతకుముందు జీయర్ స్వామికి ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణ స్వాగతం పలికారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీ ఇషా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నాట్యాలయం నాట్యాచార్యులు సంతోష్ గుప్త, శిరీష ఆధ్వర్యంలో విద్యార్థులు నాట్యం ప్రదర్శించి అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment