అర్హులందరికీ రేషన్ కార్డులు
సాక్షి,యాదాద్రి : రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ అందజేస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శనివారం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంక్షేమ పథకాల సర్వేపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సభలు, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేస్తామన్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. దరఖాస్తు చేసుకోని వారుంటే గ్రామ, వార్డుల అధికారులకు అందజేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, సివిల్ సప్లై అధికారి వనజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment